వామ్మో : అంత్యక్రియలు చేస్తుంటే లేచి కూర్చున్న బామ్మ

Chaganti
చనిపోయిన వ్యక్తిని స్మశానం దాకా తీసుకు వెళ్ళాక అనుకోకుండా అక్కడ ఆ వ్యక్తులు లేచి కూర్చున్న ఘటనలు మనం చాలా విని ఉన్నాం. సరిగ్గా అలాంటి ఘటన ఇప్పుడు మహారాష్ట్రలో కూడా చోటు చేసుకుంది. కరోనా కారణంగా ఒక వృద్ధురాలు మృతి చెందడంతో ఆమె కోసం అంత్యక్రియలు ఏర్పాటు చేశారు. ఆమె అంత్యక్రియలకు బంధువులను కూడా పిలిపించారు. మరికాసేపట్లో అంత్యక్రియలు మొదలుపెడతారు అనుకుంటూ ఉండగా ఆ బామ్మ పాడె మీద నుంచి ఏడుస్తూ లేచింది. 


ఈ దెబ్బకు ముందు షాక్ అయినా సరే తర్వాత బామ్మ బతికింది అన్న విషయం అర్థమై వెంటనే తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతానికి ఆ బామ్మ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఈ ఘటన మహారాష్ట్రలోని బారామతి గ్రామంలో చోటు చేసుకుంది. బారామతి గ్రామానికి చెందిన శకుంతలా గైక్వాడ్ అనే 76 ఏళ్ల వృద్ధురాలికి మే 10వ తేదీన కరోనా సోకింది. దీంతో కుటుంబ సభ్యులు అందరూ ఆమెను ఆసుపత్రికి తీసుకు వెళ్లారు.. 


అయితే ఆమెకు ఆసుపత్రిలో ఎక్కడా బెడ్ దొరకలేదు. దీంతో కారులోనే చాలాసేపు ఉంచడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఎంత కదిపినా ఆ బామ్మ లేవకపోవడంతో ఆమె ఇక చనిపోయిందని వాళ్ళు భావించారు. అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు చేసి మరికాసేపట్లో పాడే మీదకు ఎక్కించి తీసుకువెళ్లడానికి సిద్ధమవుతుండగా ఆమె బంధువుల ఏడుపులకు కళ్ళు తెరిచి లేచింది. దీంతో అందరూ అవాక్కయి తర్వాత ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఆమె వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బంధువుల ఏడుపులే ఆమెను బతికించాయి ఏమో. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: