డిఆర్డిఓ మరో అద్భుతం.. ఇక శత్రువులకు చమటలే..?

praveen
గతంలో భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దుల్లో పరిస్థితి ఎంత హాట్ హాట్ గా మారిపోయింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్-చైనా మధ్య ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే విధంగా మారిపోయింది పరిస్థితి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే స్వయంసమృద్ధి పై దృష్టి పెట్టింది భారత ప్రభుత్వం. భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ డీఆర్డీవో కి ఫుల్ పవర్స్ ఇచ్చేసింది.  ఇక అధునాతన టెక్నాలజీతో కూడిన క్షిపణులను ఆయుధాలను తయారు చేసేందుకు అటు అన్ని రకాల ప్రోత్సాహకాలను అందించింది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా భారీగా నిధులను కేటాయించింది.

 కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో మద్దతు అందడంతో అటు ఆర్డీవో శాస్త్రవేత్తలు అందరూ కూడా ఇప్పటికే ఎన్నో రకాల క్షిపణులను కనిపెట్టి ఔరా అనిపించారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే కేవలం క్షిపణులను అభివృద్ధి చేయడమే కాదు వాటికి ప్రయోగాలు నిర్వహించిన సక్సెస్ అయింది డిఆర్డిఓ. అంతేకాకుండా డిఆర్డిఓ ప్రయోగించి సక్సెస్ అయిన క్షిపణులను విదేశాలకు విక్రయించడం కూడా మొదలు పెట్టింది. ఇలా ఆయుధ విక్రయాలలో కూడా దూసుకుపోతుంది భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ. అయితే డిఆర్డిఓ అభివృద్ధి చేసిన అధునాతన టెక్నాలజీతో కూడిన ఆయుధాలలో తేలికపాటి యుద్ధ విమానంగా తేజస్ యుద్ధ విమానాన్ని తయారుచేశారు.

 అయితే డీఆర్డీవో అభివృద్ధి చేసిన తేజస్ యుద్ధ విమానం ఇప్పుడు మరింత శక్తివంతంగా మారినట్లు తెలుస్తోంది. తేజస్ కి ఫిఫ్త్ జనరేషన్ కు సంబంధించిన ఫైజాన్  మిస్సయిల్ అమర్చి ఇటీవలే పరిశోధకులు పరీక్షించారు. అయితే ఫైజాన్ క్షిపణి ని తేజస్ యుద్ధ విమానం గగనతలంలో నుంచి గగనతళం  ఉన్న టార్గెట్ ను చేధించేందుకు  ఉపయోగించాలి. ఐదవ తరం క్షిపణిని అటు తేజస్ యుద్ధ విమానం ఎంతో విజయవంతంగా నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించగలిగింది  అన్న విషయాన్ని చెప్పుకొచ్చారు శాస్త్రవేత్తలు. అయితే ఈ అత్యాధునిక క్షిపణి కారణంగా లైట్ వెయిట్ కలిగిన తేజస్ యుద్ధ విమానం ఎంతో సమర్థవంతంగా దాడి చేసే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: