చైనా బ్యాటరీలు లేవిక...భారత్ లోనే బ్యాటరీలు తయారీ..

VAMSI
ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్యలలో వాయు కాలుష్యం కూడా ఒకటిగా పరిగణించవచ్చు. ఈ వాయు కాలుష్యం వలన అనేక రకాలుగా మానవులకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. అంతే కాకుండా పర్యావరణం దెబ్బతింటుంది. మరియు వాతావరణంలోని ఓజోన్ పొర కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని ఎప్పటికప్పుడు వాతావరణ శాస్త్ర నిపుణులు మరియు శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తూనే ఉంటారు. కానీ ఈ దేశంలో వ్యక్తిగతంగా ఎవ్వరికీ కనీస బాధ్యత ఉండదు. ఈ వాయు కాలుష్యానికి ప్రధాన కారణం మానవులమయిన మనమే. మనము వాడే పెట్రోల్ మరియు డీజల్ వాహనాల మూలంగానే అత్యధికంగా కాలుష్యం జరుగుతుంది. అంతే కాకుండా అవసరం ఉన్నా లేకున్నా...నడిచి వెళ్లగలిగే దూరాలకు సైతం మోటార్ బైకులు వాడడం మరియు కార్లను వాడడం చేయడం వలన కాలుష్యం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది.
అయితే తాజా పరిస్థితులను గమనిస్తే ఇండియాలోకి ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది ప్రధాని మోదీ ప్రభుత్వం. మొత్తం ప్రపంచమంతా కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను వాడడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతోంది. రాబోయే 2024 సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా కనీసం ఎంత లేదన్నా 25 శాతం వాహనాలు ఎలక్ట్రిక్ వి ఉంటాయి. మరియు ఇంకొద్ది కాలం అంటే 2030 కి వచ్చే సరికి 80 శాతం ఎలక్ట్రిక్ వాహనాలు అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. విద్యుత్ కూడా ఆ సమయానికి చాలా వరకు తగ్గే అవకాశముంది. ఇప్పుడు ఈ అంశంలో బ్యాటరీలు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ఇంతకు ముందు వరకు మనము కేవలం చైనా బ్యాటరీస్ మీదనే ఆధారపడే వాళ్ళము.
అయితే మొన్ననే నరేంద్ర మోదీ ఒక ప్రకటనలో ఇండియాలోనే బ్యాటరీలను తయారు చెయ్యాలని చెప్పారు. రాబోయే ఆరునెలల కాలంలో ఎలక్ట్రిక్ వాహానాలకు ఉపయోగించే బ్యాటరీలను పూర్తి స్థాయిలో తయారు చేస్తామని మొన్న నితిన్ గడ్కరీ తెలిపారు. అంతే కాకుండా ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ ల తయారీ కోసం ఆటోమొబైల్ ఇండస్ట్రీ వారితో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు. ఈ విధానం వలన పెట్రోల్ మరియు డీజిల్ వంటి ఇంధనాలతో కూడా నడిపే అవకాశం ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం హైడ్రోజన్ సెల్ ఫ్యూయల్ టెక్నాలజీ మీద కూడా పని చేస్తున్నట్లు ఒక ప్రకటనలో నితిన్ గడ్కరీ తెలిపారు. ఇవన్నీ కనుక వినియోగంలోకి వస్తే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడమే కాకుండా...పర్యావరణం కి ఎటువంటి హాని జరగకుండా ఉంటుంది. మరియు మనకు ట్రాన్స్పోర్టేషన్ లో భారీ ఎత్తున ఖర్చు తగ్గే అవకాశం ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: