కరోనా వైరస్ కారణంగా కంటి చూపు కూడా పోతుందా....!?

Suma Kallamadi
వుహాన్ లో విజృంభించి ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా వ్యాప్తిచెందిన కరోనా మహమ్మారి దాదాపు 30 లక్షల మందిని బలిగొన్నది. ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల మందికి పైగా కరోనా వైరస్ బారిన పడ్డారు. కనిపించని వైరస్ కారణంగా కోట్ల మంది ఆకలితో అలమటించారు. కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డ కుటుంబాలు ఎన్నో ఉన్నాయి.

అయితే ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ తీవ్రత తగ్గి అందరి జీవితాలు మళ్లీ సాధారణ స్థితికి వస్తున్నాయని అనుకుంటున్న నేపథ్యంలో రెండవసారి కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈసారి మొదటిసారి కంటే వేగంగా వ్యాప్తి చెందుతూ వయసు పైబడిన ప్రజలతోపాటు చిన్న పిల్లలపై కూడా తీవ్రత చూపుతోంది. దీనితో ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి వస్తోంది. గత ఏడాది కంటే ఈ ఏడాది కరోనా వైరస్ త్వరగా లక్షణాలు చూపిస్తోంది. గతంలో 7 నుంచి 12 రోజుల తర్వాత కరోనా బాధితుల ఆరోగ్యం క్షీణించేది కానీ రెండవ దశలో సంక్రమిస్తున్న కరోనా వైరస్ కారణంగా బాధితుల ఆరోగ్య పరిస్థితి 3 నుంచి 5 రోజుల లోపే ప్రమాదకరంగా మారుతోంది. దీంతో మళ్లీ మాస్క్ ధరిస్తూ.. భౌతిక దూరం పాటించే రోజులు వచ్చాయి.

అయితే కరోనా వైరస్ బారినపడిన ప్రజలకు కాలేయం, హృదయ, మెదడుకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదముందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీర్ఘకాలిక covid-19 వ్యాధిగ్రస్తులలో ఇటువంటి లక్షణాలు కనిపించే అవకాశాలున్నాయి. అయితే తాజాగా శాస్త్రవేత్తలు మరొక కరోనా వ్యాధి లక్షణాన్ని కనిపెట్టారు. కరోనా బారినపడి ఎవరైతే ఆక్సిజన్ బెడ్, వెంటిలేటర్ పై చికిత్స పొందుతారో వారిలో రెటీనా ఇన్ ఫ్లమేషన్ సమస్య తలెత్తుతోందని శాస్త్రవేత్తలు కొత్తగా కనిపెట్టారు. కంటి చూపు పోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా కరోనా రాకుండా రాష్ట్ర, ప్రభుత్వాల మార్గదర్శకాలను పాటించాలి. భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై కఠినమైన ఆంక్షలను అమలు చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: