హైదరాబాద్‌లో పట్టపగలే కాల్పుల కలకలం..!!

Edari Rama Krishna
భారత దేశంలో పెద్ద పెద్ద నగరాలు విస్తరిస్తున్నా కొద్ది అరాచక శక్తులు కూడా విజృంభిస్తున్నాయి. మాఫియా,స్మగ్లింగ్,టెర్రరిజం అన్నీ ఇక్కడ పాతుకు పోతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ,ముంబాయి,బెంగుళూరు,చెన్నై లాంటి మహానగరాల్లో అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కూడ ప్రపంచం గుర్తించిన మహానగరం... అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతున్న నగరం అయితే ఇక్కడ కూడా అరాచక శక్తులకు అడ్డగా మారిపోయింది. గన్ కల్చర్ విజృంభిస్తుంది.

తాజాగా నగరంలో పట్టపగలు కాల్పుల కలకలం రేగింది... జూబ్లీహిల్స్లోని నీరూస్ షోరూం వద్ద ఓ వ్యక్తి గురువారం హల్చల్ సృష్టించాడు. తనవద్ద ఉన్న రివాల్వర్తో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. జూబ్లీహిల్స్ రోడ్ నం.36 లో ఉన్న నీరూస్ షోరూమ్ ఆవరణలో కాల్పులకు పాల్పడ్డాడు. దుండగుడు గాల్లోకి కాల్పులు జరిపగా ప్రజలు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఈ కాల్పుల్లో ఎల్ అండ్ టీ వర్కర్ గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు,  వాళ్లలో ఒకరిని టాస్క్ఫోర్స్ సిబ్బంది, మరికొందరు స్థానికులు కలిసి పట్టుకున్నారు.  మరోవ్యక్తి ఘటనా స్థలం నుంచి పారిపోయాడు.  కాల్పుల్లో గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

కాల్పులకు పాల్పడిన ముఠాలోని మిగిలిన ఇద్దరూ తప్పించుకున్నారు. ఐదురోజుల క్రితం ఈ ముఠా సభ్య్లులు దోపిడీ కోసం హైదరాబాద్ కి వచ్చినట్లు తెలుస్తోంది. వీరు కర్నాటక గుల్భర్గా, రాయచూర్ ప్రాంతాలవారిగా అనుమానిస్తున్నారు. వీరు గతంలో బ్యాంకు దోపిడీలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ముఠా సభ్యులు గత నాలుగురోజులుగా ఇక్కడ రిక్కీ నిర్వహించినట్లు సమాచారాన్ని పోలీసులు సేకరించారు. వీరు గత నాలుగురోజుల నుంచి ఏ బ్యాంకు లో దోపిడీకి పాల్పడితే అత్యధిక సొమ్ము పొందవచ్చో గమనిస్తున్నారు. నీరూస్ షోరూంని చివరకు ఎంచుకున్నారు.

కాల్పులు జరిగిన స్థలం


ఒక అగంతకుడు లోపలికి ప్రవేశించగా, మిగిలిన ఇద్దరూ బయట కాపలాగా ఉన్నారు.  మఫ్టీలోని పోలీసులు చాకచక్యంతో లోపలి దుండగుడ్ని అదుపులోకి తీసుకోగలిగారు.  నగరంలో వాళ్ల టార్గెట్ ఏంటి.. కేవలం దోపిడీయేనా, మరేదైనా ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టేందుకు వచ్చారా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. ప్రస్తుతం పోలీసుల విచారణలో ఉన్న వ్యక్తి నుంచి ఓ తుపాకీతో పాటు 20 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: