ఆంధ్రప్రదేశ్- తెలంగాణ మధ్య మరిన్ని రైళ్లు... ఏప్రిల్ 1 నుంచి అవి కూడా..
గుంటూరు- కాచిగూడ రైలు (07251), కాచిగూడ-రేపల్లే రైలు (07625), సికింద్రాబాద్-కర్నూల్ తుంగభద్ర ఎక్స్ప్రెస్ కర్నూల్-సికింద్రాబాద్ హద్రినీవా ఎక్స్ప్రె్సలు కూడా ఏప్రిల్ 1నుంచి ప్రారంభంకానున్న రైళ్లు ఇవే... విజయవాడ–సికింద్రాబాద్–విజయవాడ(మెయిల్ ఎక్స్ప్రెస్) : 02799/02800, విశాఖపట్నం–సికింద్రాబాద్–విశాఖపట్నం(మెయిల్ ఎక్స్ప్రెస్) : 02739/02740, గుంటూరు –విశాఖపట్నం–గుంటూరు : 07239/07240, గూడూరు –విజయవాడ–గూడూరు(మెయిల్ ఎక్స్ప్రెస్) : 02734/02644, నర్సాపూర్–ధర్మవరం–నర్సాపూర్(మెయిల్ ఎక్స్ప్రెస్): 07247/ 07248, ఈ రైళ్లను ఏప్రిల్ 1వ తేదీ నుంచి పునరుద్దరించానున్నారు. వీటిని ప్రత్యేక రైళ్లుగా దక్షిణ మధ్య రైల్వే నడవనుంది. కాగా, ప్రస్తుతం రైల్వే శాఖ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రత్యేక ట్రైన్స్గా నడుపుతుండగా.. ప్యాసింజర్ రైళ్లను మాత్రం ఇంకా పునరుద్దరించలేదు. రెగ్యులర్ రైళ్ల కోసం జనాలు ఇంకా ఎదురు చూపులు చూస్తున్నారు.
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో రైళ్లను రద్దుచేసిన దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) అన్లాక్ తర్వాత దశలవారీగా పునరుద్ధరిస్తున్నది. ఇందులో భాగంగా ఎస్సీఆర్ ఆధ్వర్యంలో మొత్తం 300 ఎక్స్ప్రెస్ రైళ్లు ఉండగా, ఇప్పటికే 180 రైళ్లు నడుస్తున్నాయి. వీటికి అదనంగా మరో 22 ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా పునరుద్ధరించాలని ఎస్సీఆర్ జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా నిర్ణయించారు. వీటిని ఏప్రిల్ 1వ తేదీనుంచి మార్గాలవారీగా ప్రారంభించనున్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం రైళ్లను పునరుద్ధరిస్తున్నట్టు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.