టమాట జ్యూస్ తాగడం వలన ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!?

N.ANJI
నేటి సమాజంలో మారుతున్న పరిస్థితులతో ప్రతిఒక్కరూ అనారోగ్యం వారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మనం తిసుకునే ఆహారాన్ని, జీవనశైలిని మార్చుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే మనకు తెలిసినంత వరకు టమాటాను కూర చేయడంలో వాడుతుంటారు. ఇక టమాటాలు చేసే మేలు అధికమని నిపుణుల పరిశోధనలో తేలింది.
అయితే కూర లేదా వేరే వేరే విధంగా కాకుండా.ట‌మాటాల‌ను జ్యూస్ రూపంలో తీసుకుంటే మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు పొందొచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా త‌ర‌చూ డీహైడ్రేష‌న్ స‌మ‌స్య‌తో బాధ ప‌డే వారు.రెగ్యుల‌ర్‌గా ఒక గ్లాస్ చ‌ప్పున ట‌మాటా జ్యూస్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే, శ‌రీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచే గుణాలు ట‌మాటా జ్యూస్ పుష్క‌లంగా ఉంటాయి.అలాగే ట‌మాటా జ్యూస్‌లో ఫైబ‌ర్, వాట‌ర్ ఎక్కువ‌గా ఉంటాయి. కొవ్వు, కేల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి.అందువ‌ల్ల‌, వెయిట్ లాస్ అవ్వాల‌ని ప్ర‌య‌త్నించే వారు. రోజుకో గ్లాస్ ట‌మాటా జ్యూస్ తీసుకుంటే వేగంగా బ‌రువు త‌గ్గొచ్చు.
ఇక ప్రతిరోజూ టమాట జ్యూస్ తాగితే.. బరువు తగ్గడంతోపాటు రక్త పీడనం సమస్యను కూడా సులభంగా తగ్గించుకోచ్చు. టమాట జ్యూస్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. డయాబెటిస్ ఉన్నవారు టమాట రసాన్ని తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల నుంచి బయట పడవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. క్యాన్సర్ వంటి ప్రాణాంత‌క వ్యాధి ద‌రి చేర‌కుండా కూడా ట‌మాటా జ్యూస్ స‌హాయ‌ప‌డుతుంది.
అయితే టమాటలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది. దీంతో జీర్ణక్రియ ప్రక్రియ వేగవంతంగా జరిగి ఉదర సమస్యలు ఉత్పన్నం కావు. చర్మ సమస్యలున్నా త్వరగా నయమవుతాయని.. నిపుణులు పేర్కొంటున్నారు. టమాటలో ఉండే విటమిన్ సి, బీటా కెరాటిన్, విటమిన్ ఈ వల్ల కొవ్వు అదుపులో ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. దీని ద్వారా బరువును కూడా అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఉదయాన్నే టామాట జ్యూస్ తాగాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: