పుర పోరు : కళ్యాణదుర్గంలో ఆ వర్గపోరే టీడీపీకి ప్లస్ ?

Chaganti
మరో మూడు రోజుల్లో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపు బావుటా ఎగురవేసేందుకు గాను అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పెద్ద ఎత్తున కష్ట పడుతున్నారు. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ముఖ్య నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇక ఇప్పటికే గెలుపు మాదంటే మాదని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా విషయానికి వస్తే జిల్లా మొత్తం మీద ఎలా అయినా టీడీపీ హోరాహోరీగా ప్రయత్నాలు చేస్తోంది. ఇక కళ్యాణదుర్గం మున్సిపాలిటీ మీద టీడీపీ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో ఆ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఉమామహేశ్వరనాయుడు స్థానిక నేతలతో కలిసి ఒంటరి పోరు సాగిస్తున్నారు. 

నిజానికి గతంలో ఆయన ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా సరే ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఆయన అధినేత చంద్రబాబు సూచనలతో ఎప్పటికప్పుడు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఎన్నికల సమయంలో కూడా తన ప్రచారాన్ని వినూత్న రీతిలో చేస్తూ ఆయన ముందు వెళుతున్నారు. జిల్లాలో ముఖ్య నేతలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ వారిని కూడా ప్రచారానికి తీసుకువస్తూ ఇక్కడ జెండా ఎగురవేయాలని ఉమామహేశ్వర నాయుడు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 

నియోజకవర్గ ఇన్చార్జిలా కాకుండా ఒక తెలుగుదేశం కార్యకర్తలా ఆయన ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తూ ఉండడంతో కచ్చితంగా ఇక్కడ టీడీపీ జెండా ఎగురవేయడం ఖాయం అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి సంబంధించి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉష శ్రీ చరణ్ వున్నారు. ఆమె పెద్దగా ప్రచారంలో జనాలను ఆకట్టుకోలేక పోతున్నారనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. మరి చూడాలి ఇక్కడ పరిస్థితి ఏ మేరకు ప్రతిపక్ష టీడీపీకి కలిసి వస్తుంది అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: