ఖమ్మం జిల్లాలో కొత్త వైరస్

SRISHIVA
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు వైరస్ పేరు చెబితేనే భయపడిపోవాల్సిన పరిస్థితి ఉంది. 2019లో వెలుగులోనికి వచ్చిన కరోనా వైరస్.. ఇప్పటికి వణికిస్తూనే ఉంది. కరోనా వైరస్.. రూపు మార్చుకుంటూ విస్తరిస్తోంది. కరోనా కంటే డేంజర్ వైరస్ లు త్వరలో రాబోతున్నాయని ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి. తాాజాగా తెలంగాణలో మరో వైరస్ బయటపడింది. ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.
 
 ఖమ్మం జిల్లాలో  జెమినీ వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇది కూడా  భయంకరమైనదే. అయితే ఇది మనుషులకు సోకదు. పంటలకు వస్తోంది. జెమినీ వైరస్ నే బొబ్బరతెగులు అని పిలుస్తున్నారు. ప్రస్తుతం ఇది ఖమ్మం జిల్లాలోని మధిర, ఎంకూరు, కొణిజర్ల, కామేపల్లి, తిరుమలయపాలెం మండలాల్లో విస్తరించింది.  ఈ వైరస్ ప్రభావంతో మిర్చి పంటలు నాశనమవుతున్నాయి. ఎండుమిర్చికే ఇది ఎక్కువగా వస్తోంది. ఎండుమిరపకాయలు కారంగా ఉంటాయి కాబట్టి వాటికి ఎలాంటి తెగుళ్లూ సోకవు అనుకుంటాం. కానీ దురదృష్టం కొద్దీ ఈ జెమినీ వైరస్ కారంని తట్టుకోగలదు. ఈ వైరస్ ప్రభావం వల్ల ఎకరాకు 500 కేజీల దాకా దిగుబడి తగ్గిపోయిందని రైతులు లబోదిబో మంటున్నారు.  
జెమినీ వైరస్‌... తెల్లటి చిన్నగా ఎగిరే పురుగులు ద్వారా మిర్చి పంటను చేరుతుంది. ఇది పంటపై చేరగానే... ముందుగా... ఆకులను మడతపెడుతుంది. ఆకులు ముడుచుకుపోతాయి. మొక్క పెరిగే దశలను ఈ వైరస్ నాశనం చేస్తుంది. ఎండుమిర్చి మొగ్గలు రాకుండా చేస్తుంది. దాంతో దిగుబడి తగ్గిపోతుంది.  ఖమ్మం జిల్లాలో 56,000 ఎకరాల్లో మిర్చి పంట వేశారు. గతేడాది 54,000 ఎకరాల్లో పండించారు. గతేడాది క్వింటాలు ధర రూ.20,000 ఉండటంతో.. చాలా మంది రైతులు ఈ పంట వేశారు.
 అయితే జెమినీ వైరస్ సోకడంతో ఎండు మిర్చి రైతులంతా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు.
 ఐతే... ఈ వైరస్ ప్రభావం ఎండుమిర్చిపై ఉండదనీ... ఆ ఎండుమిర్చిని అందరూ వాడొచ్చని అధికారులు తెలిపారు.పంటను పండించే ముందే... ట్రెక్‌డెర్మా ఉపయోగించాలనీ అలాగే... ప్రతి 2 లేదా మూడేళ్లకోసారి... వేసే పంటలను మార్చేస్తూ ఉండాలనీ వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: