మునగతో ఎన్ని వ్యాధులకు చెక్ పెట్టొచ్చో తెలిస్తే షాక్..!?

N.ANJI
మనకు తెలిసినంత వరకు మునగాను సాంబారు, టమాటో కర్రీలకు వాడుతుంటారు. అంతేకాక కొన్ని సార్లు సామెతలలో కూడా వాడుతుంటారు. ఇక ఎవరైనా మన గురించి అతిశయోక్తితో మాట్లాడితే మునగ చెట్టు ఎక్కించొద్దు అంటుంటారు. కానీ అది ఒకప్పటి మాట. మరి ఇప్పటి మాట మునగ సర్వరోగ నివారిణి అంటున్నారు. ఇక నిజంగా ఇది నిజం  మునగ చెట్టు గురించి అంత తక్కువ చేసి మాట్లాడే రోజులు పోయాయి. మునగ చెట్టు ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఒక్క మాటలో చెప్పాలంటే మునగ చెట్లు సర్వరోగ నివారిణిగా చెప్పొచ్చు. మునగకాయ అని పిలువబడే మోరింగ ఒలిఫెరాను ఆయుర్వేదంలో యుగాల నుంచి ఉపయోగిస్తున్నారు.
అయితే మీకు తెలిసి ఇది ఎన్ని రకాల సమస్యలకు వైద్యం చేయగలదు చెప్పండి. విటమిన్ల లోపం, ఆర్థరైటిస్, రక్తహీనత, శృంగారం, సంతాన సమస్యలకు ఉపయోగపడుతుంది. అంతే కాదు నిజానికి.. మునగాకు దాదాపు 300 వ్యాధులను నయం చేయగలదట. ఆశ్చర్యంగా ఉంది కదూ.. అవును ఇది నిజం. అందుకే మునగ చెట్టును చాలా మంది.. ‘మిరాకిల్ ట్రీ’ అని పిలుస్తారు. మునగకాయల్లో ఉండే విటమిన్ సి అనారోగ్య రుగ్మతలను దూరం చేస్తుంది. మధుమేహం ఉన్నవారికి మునగ ఎంతో మేలు చేస్తుంది. మునగకాయలను వారానికి ఐదుసార్లు తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇక సాధారణంగా మునగాకు, మునగకాయల వినియోగం జుట్టు రాలడం, మొటిమలు, రక్తహీనత, విటమిండిఫిషియెన్సీ, తక్కువ రోగనిరోధక శక్తి, ఆర్థరైటిస్, దగ్గు, ఉబ్బసం తదితర సాధారణ సమస్యలలో ఉపయోగపడుతుంది. వీటిలో చాలా రకాల ఆరోగ్యకరమైన సమ్మేళనాలు ఉన్నాయి. అవేంటంటే.. విటమిన్ ఎ, విటమిన్ బి 1 (థియామిన్), బి 2 (రిబోఫ్లేవిన్), బి 3 (నియాసిన్), బి -6, ఫొలేట్, ఆస్కార్బిక్ ఆమ్లం (విటమిన్ సి), కాల్షియం, పొటాషియం, ఇనుము, మెగ్నీషియం, భాస్వరం, జింక్. వీటితో పాటు మునగలో యాంటీబయాటిక్, అనాల్జేసిక్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటిక్యాన్సర్, యాంటీడియాబెటిక్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీగేజింగ్‌గా లక్షణాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: