అలర్ట్: క్రెడిట్ కార్డు బిల్లు ఇస్టానుసారంగా కడితే భారీ షాక్..!?

N.ANJI
నేటి సమాజంలో చాల మంది క్రెడిట్ కార్డులు వాడుతూ ఉంటారు. ఇక క్రెడిట్ కార్డుని వాడుతూ ఇంట్లో వస్తువులను కొంటారు. ఇక వాటిని ఇన్ స్టాల్ మెంట్ లో డబ్బులు కడుతూ ఉంటారు. ఇక మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? అయితే మీరు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అయితే క్రెడిట్ కార్డుతో ఎన్ని లాభాలు ఉన్నాయో అదే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయని గుర్తించుకోవాలి. ఇక నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని సంబంధిత అధికారులు వెల్లడించారు.
అయితే క్రెడిట్ కార్డు బిల్లు కచ్చితంగా కడుతూ రావాలి. ఇష్టానుసారంగా క్రెడిట్ కార్డు బిల్లు కట్టకుండా వస్తే మాత్రం నష్టపోవాల్సి వస్తుంది. క్రెడిట్ కార్డు బిల్లు కరెక్ట్‌ టైమ్‌కు కట్టకపోతే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ఒక్కరి తెలుసుకుందామా. అయితే క్రెడిట్ కార్డు బిల్లు ఆలస్యం చేస్తే ఆలస్య రుసుము చెల్లించుకోవాలి. మీ క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్‌లో ఈ చార్జీలు కలిసి వస్తాయి. అంతేకాకుండా వడ్డీ భారం కూడా మోయాల్సి వస్తుంది. మీరు మీ బిల్లు మొత్తాన్ని 60 రోజులు దాటిన తర్వాత కూడా కట్టకపోతే మాత్రం వడ్డీ రేట్లు పెరుగుతాయి.
ఇక మీరు మీ బిల్లు మొత్తాన్ని కరెక్ట్ టైమ్ కి కట్టకపోతే ఆ విషయం క్రెడిట్ బ్యూరోలకు చేరుతుందని అధికారులు ఈ సందర్బంగా వెల్లడించారు. దీంతో మీ క్రెడిట్ స్కోర్ ‌పై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. ఈ ఎఫెక్ట్ మీ క్రెడిట్ స్కోర్‌పై ఏడేళ్లు ఉంటుంది. ఇక ఆలస్య రుసుము చెల్లిస్తే రివార్డు పాయింట్లు కూడా కోల్పోవలసి రావొచ్చునని అన్నారు. అదే మీరు 180 రోజులు అయినా కూడా క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే మీ అకౌంట్ ‌ను మొండి బకాయి కిందకు పరిగణిస్తారని తెలిపారు. ఇక మీ క్రెడిట్ కార్డు పని చేయదని అధికారులు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: