ఇక క‌రెంటు క‌ష్టాలు ఉండ‌వ్‌...తెలంగాణ‌లో భారీ సౌర విద్యుత్ ఉత్ప‌త్తి కేంద్రం...

Spyder
సౌర విద్యుత్ ఉత్ప‌త్తికి సింగ‌రేణి సంస్థ వేగంగా అడుగులు వేస్తున్న విష‌యం తెలిసిందే. ఈక్ర‌మంలోనే ఇటీవ‌లి కాలంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు కూడా తీసుకుంది. సంప్ర‌దాయ బొగ్గు ఉత్ప‌త్తి ద్వారా నాణ్య‌మైన విద్యుత్ ఉత్ప‌త్తికి తోడుగా సౌర విద్యుత్‌ను స‌మాంతరంగా అభివృద్ధి చేసుకునేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌తో ముందుకెళ్తోంది. సింగరేణి సంస్థ వచ్చే ఐదేళ్లలో 1000 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి కేంద్రాలను నెలకొల్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే సింగరేణి 300 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టులను చేపట్టింది. ఇందులో సుమారు 55 మెగావాట్ల ఉత్పత్తిని ప్రారంభించి గ్రిడ్‌తో అనుసంధానం చేసింది.

ఈక్రమంలో భారీ రిజర్వాయర్లలో నీటిపై తేలియాడే సౌర విద్యుత్‌ ప్లాంట్లను కూడా నిర్మించాలనే ఉద్దేశంతో కరీంనగర్‌కు ఆనుకొని ఉన్న లోయర్‌మానేరు డ్యాంను ఎంచుకున్నది.  నిర్మాణ వ్యయం, నిర్మాణానికి పట్టే సమయం, అనుకూలతలు తదితర అంశాలపై రెడ్కో, సింగరేణి అధికారులు చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాగానే ఎల్‌ఎండీ నీటిపై తేలియాడే సౌర విద్యుత్‌ ప్లాంటును చేపట్టనున్నారు. మ‌రోవైపు  బెల్లంపల్లి రీజియన్‌లో రెండు కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా రెబ్బెన మండలం గోలేటి ప్రాంతంలో మూతపడిన డోర్లి-1, డోర్లి-2 ఓపెన్‌కాస్టు గనుల్లో ప్లాంట్‌ నిర్మాణానికి యాజమాన్యం సన్నాహాలు చేస్తుండ‌టం విశేషం.

 డోర్లి-1 ఓపెన్‌కాస్టుపై 10 మెగావాట్లు, డోర్లి-2లో 5 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ రెం డింటి నిర్మాణ పనులను అదాని, గ్లోబల్‌ గ్రీన్‌ ఏజెన్సీలు దక్కించుకున్నా యి.  అయితే, ఒక మెగావాట్‌ సౌర విద్యుత్‌కు ఐదు ఎకరాల భూమి అ వసరమవుతుంది. ఇందుకోసం సింగరేణి 50 ఎకరాల భూమిని చదును చేసి ర్యాంపులు నిర్మించి సిద్ధంగా ఉంచింది. ప్రారంభించిన ఎనిమిది నెల ల్లో పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పైనా సౌర విద్యుత్‌ ప్లాంటులను ఏర్పాటు చేసేందుకు సింగరేణి సంప్రదింపులు ప్రారంభించింది. కరీంనగర్‌ జిల్లాలోని మిడ్‌ మానేరుతో పాటు ఆసిఫాబాద్‌లోని కుమరం భీం ప్రాజెక్టు పరిసరాల్లోనూ  విద్యుదుత్పత్తి చేసేందుకు ఇప్పటికే సాంకేతిక నిపుణులతో కలిసి అధ్యయనం చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: