టీడీపీలో మాజీ మంత్రికి కీల‌క ప‌ద‌వి... బెదిరింపుల‌కు బాబు లొంగారా ?

VUYYURU SUBHASH
ఏపీ పంచాయతీ ఎన్నికల వేళ టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఖాళీగా ఉన్న ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇన్‌చార్జ్‌ల‌ను నియ‌మిస్తున్నారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా తాడేప‌ల్లిగూడెం టీడీపీ ఇన్‌చార్జ్ గా వ‌ల‌వ‌ల మ‌ల్లిఖార్జున రావు ( బాబ్జీ) ని నియ‌మించిన టీడీపీ అధిష్టానం తాజాగా క‌ర్నూలు జిల్లాలో మంత్రి బుగ్గ‌న రాజేంద్రనాథ్ రెడ్డి ప్రాథినిత్యం వ‌హిస్తోన్న డోన్ నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతల్ని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌కు అప్పగించారు. ఈ మేరకు మంగళవారం పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. త‌న‌కు ఈ బాధ్య‌త‌లు ఇచ్చిన వెంట‌నే ప్ర‌భాక‌ర్ చంద్ర‌బాబును క‌లిశారు.

ఇటు నియోజ‌క‌వ‌ర్గ నేత‌ల‌తో స‌మావేశ‌మైన వైసీపీ బ‌ల‌వంత‌పు ఏక‌గ్రీవాల‌ను ఎలా ? అడ్డుకోవాల‌న్న దానిపై కేడ‌ర్‌తో చ‌ర్చించారు. నియోజ‌కవ‌ర్గంలోని ప్యాపిలీ, బేతంచెర్ల మండలంలో అధికార పార్టీ నేతలు .. టీడీపీ నేత‌ల‌ను నామినేష‌న్లు వేయ‌కుండానే బెదిరింపుల‌కు గురి చేస్తున్నారంటూ ఆయ‌న మండిప‌డ్డారు. ఇక కేఈ ప్ర‌భాక‌ర్ .. మాజీ డిప్యూటీ సీఎం కేఈ. కృష్ణ‌మూర్తికి స్వ‌యానా సోద‌రుడు. ఆయ‌న కూడా గ‌తంలో మంత్రిగా ప‌నిచేశారు. ప్ర‌భాక‌ర్ మొదటిసారి 1999లో ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 2004లో కోట్ల సుజాతమ్మ చేతిలో ఓడిపోయారు.

2009లో ప్రభాకర్ సోదరుడు కృష్ణమూర్తి డోన్‌లో పోటీ చేయడంతో.. ఆయన పత్తికొండ నుంచి పోటీచేసి గెలిచారు. 2014లో మరో సోదరుడు ప్రతాప్ డోన్ నుంచి పోటీచేసి ఓడిపోవడంతో.. 2019లో ప్రభాకర్‌ను డోన్ నుంచి పోటీచేసి చేయించగా ఓడిపోయారు. ఇక ఎమ్మెల్సీగా ఉన్న కేఈ ప్ర‌భాక‌ర్ గ‌త ఎన్నిక‌ల్ల పార్టీ ఓడిపోయాక చంద్ర‌బాబుపై అల‌క‌బూని కొద్ది రోజులుగా పార్టీకి దూరంగా ఉన్నారు. త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేస్తానని కూడా హెచ్చరించారు. చివ‌ర‌కు ఆయ‌న బెదిరింపుల‌కు.. బాబు బుజ్జ‌గింపులు ప‌లించ‌డంతో ఇప్పుడు తిరిగి డోన్ పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టేందుకు రెడీ అవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: