షాకింగ్: చైనాకు దిమ్మతిరిగే ఇండియా వార్త..?

Chakravarthi Kalyan
ఇది నిజంగానే మన పొరుగున ఉన్న పక్కలో బల్లెం చైనాకు దిమ్మతిరిగే వార్తే.. అదేంటంటే.. తేజస్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంటోంది. ఇవాళ ఈ ఒప్పందం కుదురనుంది. హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ నుంచి ఈ తేజస్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. రూ.48 వేల కోట్ల విలువైన 83 తేజస్‌ యుద్ధ విమానాలు కొనుగోలు చేయనున్నారు. ఈ ఒప్పందంపై చేయనున్న రక్షణశాఖ, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ అధికారులు ఇవాళ సంతకాలు చేయనున్నారు.
ఈ తేజస్ విమానాల గొప్పదనం ఏంటంటే.. తేజస్‌ విమానాలకు ప్రపంచంలోనే అత్యుత్తమైందన్న పేరుంది. తొలితరం తేజస్‌తో పోలిస్తే ఇప్పుడు కొనుగోలు చేయబోతున్న ఎంకే1ఏ రకంలో చాలా మార్పులు చేస్తారు. ఇప్పటికే వాయుసేనలో ఉన్న తేజస్‌ ఎంకే1 ఎఫ్‌వోసీకి ఇది అడ్వాన్స్ మోడల్‌ అని చెప్పొచ్చు.  దీనిలో క్వాడ్రప్లక్స్‌ డిజిటల్‌ ఫ్లైబైవైర్‌ వ్యవస్థను వినియోగించారు. విమానం బరువు తగ్గించేందుకు తయారీలో ప్రత్యేక మిశ్రమ లోహాలను వినియోగించారు. వీటి వల్ల విమానం మన్నిక గడువు కూడా పెరుగుతుంది.
ఇండియాకు పొరుగున ఉన్న పాకిస్తాన్, చైనా రెండూ శత్రుదేశాలే.. పాక్ తో మనది ఆగర్భ శత్రుత్వమైతే.. చైనా ఇటీవల మరీ పక్కలో బల్లెంగా మారిపోతోంది. అటు కాశ్మీర్‌ వైపు నుంచి పాక్ చొరబాటుకు ప్రయత్నిస్తుంటే.. ఇటు లద్దాఖ్‌, అరుణాచల్ ప్రదేశ్ వంటి చోట్ల చైనా కాలు దువ్వుతోంది. అందుకే ఇండియా తనవంతు జాగ్రత్తగా ఉండాల్సిన కీలక సమయం ఇది. అందుకే తన ఆయుధ సత్తాను ఇండియా రోజురోజుకూ పెంచుకుంటోంది.
తాజాగా రాబోతున్న తేజస్ కొత్త విమానాలతో పాటు ఇటీవలే.. భారత్ సైన్యం అమ్ముల పొదిలోకి కొత్త అస్త్రాలు వచ్చి చేరాయి. భారత్‌ డ్రోన్ల తయారీలో కీలక ముందడుగు వేసింది. స్వార్మ్‌ టెక్నాలజీ డ్రోన్లను రూపొందించింది. దీని ద్వారా భారత్ తన శత్రువులపై మన భూభాగం నుంచే విరుచుకుపడొచ్చు. పదుల సంఖ్యలో ఉండే డ్రోన్ల ద్వారా శత్రువుల ట్యాంకులు, శత్రు స్థావరాలు, ఉగ్రక్యాంపులు, హెలీప్యాడ్‌లు, ఇంధన నిల్వలపై ఒక్కసారిగా దాడి చేయొచ్చు. ఉరుముల్లేని పిడుగుల్లా విరుచుకుపడి  విధ్వంసం చేయొచ్చు. భారత్ ఇటీవల అభివృద్ధి చేసిన ఈ స్మార్మ్ టెక్నాలజీని..  75 డ్రోన్లతో ప్రదర్శించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: