స్థానిక ఎన్నిక‌ల సాక్షిగా ప‌రిటాల సునీత‌కు షాక్‌... శ్రీరామ్ వ‌ల్లేగా ?

VUYYURU SUBHASH
ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల వేళ ఆస‌క్తిక‌ర రాజ‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార వైఎస్సార్ సీపీతో పాటు.. విప‌క్ష టీడీపీ నేత‌ల మ‌ధ్య విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లతో రాజ‌కీయం వేడెక్కుతోంది. ఇక సీమ జిల్లాల్లో వైసీపీ దూకుడు ముందు టీడీపీ ఏ మాత్రం నిల‌వ లేక‌పోతోంది. క‌డ‌ప‌, క‌ర్నూలు జిల్లాల్లో ప‌లు చోట్ల పంచాయ‌తీ, జ‌డ్పీటీసీ లు, ఎంపీటీసీ లు ఏక‌గ్రీవం అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే అనంతపురం టీడీపీలో ఇప్ప‌టికే ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో గ్రూపుల గోల‌తో పంచాయితీలు మామూలుగా లేవు.

తాజాగా ఈ ఎన్నికల వేళ మాజీ మంత్రి పరిటాల సునీతకు ఎదురుదెబ్బ తగిలింది. రాఫ్తాడు నియోజ‌క‌వ‌ర్గంలో రామగిరి టీడీపీ మండల కన్వీనర్‌గా ఉన్న సుబ్బరాయుడు ఆదివారం తన పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. పైగా రామ‌గిరి సునీత‌కు కంచుకోట లాంటి మండ‌లం. దివంగ‌త ప‌రిటాల ర‌వీంద్ర ఉన్న‌ప్ప‌టి నుంచే ఇక్క‌డ ఆ కుటుంబానికి తిరుగు ఉండేది కాదు. ఇక త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన సుబ్బారాయుడు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

మాజీ మంత్రి సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్‌ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తనను ఏ మాత్రం పట్టించుకోలేదని, దీంతో కన్వీనర్‌గా తాను ఏమీ చేయలేకపోయానన్నారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో శ్రీరామ్ మండ‌ల క‌న్వీన‌ర్ల‌తో సంబంధం లేకుండానే త‌న‌కు ఇష్టం వ‌చ్చిన వారిని పోటీ చేయిస్తున్నారు. ఇక శ్రీరామ్ చ‌ర్య‌ల వ‌ల్లే గ‌త ఎన్నిక‌ల్లో రాఫ్తాడు లో అత‌డు ఏకంగా 27 వేల ఓట్ల భారీ తేడాతో ఓడిపోవాల్సి వ‌చ్చింది.

ఎన్నిక‌ల్లో ఓడిపోయాక కొద్ది రోజులు నియోజ‌క‌వ‌ర్గంలో అడ్ర‌స్ లేని శ్రీరామ్ ఇప్పుడు స్థానిక ఎన్నిక‌ల వేళ ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలోకి వ‌చ్చి హ‌డావిడి చేస్తున్నారు. స్థానిక పార్టీ కేడ‌ర్ ను కూడా ప‌ట్టించుకోకుండా ఏక‌ప‌క్షంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తుండ‌డంతో అవి న‌చ్చ‌కే ప‌లువురు వాళ్ల‌కు దూరం జ‌రుగుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: