అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళంగా పవన్ కళ్యాణ్ ఎంత ఇచ్చాడో తెలుసా...?

Shirisha
" data-original-embed="">
శ్రీరామ నామస్మరణలో యావత్ దేశం మార్మోగిపోతోంది. ఊరూరా వాడవాడనా అయోధ్య రామాలయం గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. రామాలయ నిర్మాణం కోసం బీజేపీ, హిందూ సంఘాలు పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఒక పండగలా నిర్వహిస్తున్నారు. రామాలయ నిర్మానంలో అందరినీ భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతోనే విరాళాలు సేకరిస్తున్నారు. ఎవరికి తోచినంత వారు ఇవ్వాలని చెబుతున్నారు. రాజకీయ నాయకులు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు.కమ్యూనిస్టు భావజాలంతో రాజకీయాల్లోకి ప్రవేశించి 'చేగువేరా'లా విప్లవభావాలు పలికించి.. గత ఎన్నికల్లో కమ్యూనిస్టులతో జట్టు కట్టిన జనసేనాని పవన్ కళ్యాణ్ దారుణ ఓటములతో ఏపీ రాజకీయాల్లో ఎదురుదెబ్బలు తిన్నారు  అయితే పవన్ తిట్టిన బీజేపీనే కేంద్రంలో అధికారంలోకి రావడంతో తన స్టాండ్ మార్చుకొని అదే పార్టీని కౌగిలించుకున్నారు.
జనసేనాని పవన్ కల్యాణ్ అయోధ్య రామమందిరం నిర్మాణానికి రూ.30 లక్షల విరాళం ప్రకటించారు.తిరుపతిలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కోసం వచ్చిన జనసేనాని ఇవాళ నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు ప్రకటించారు. . పవన్ సహచరులు .. జనసేన పార్టీ నాయకులు - క్రైస్తవులు ముస్లింలతో సహా వివిధ మతాలకు చెందిన వారు కూడా విరాళాలు అందించారు...దాని తాలూకు డీడీని కూడా అందిస్తున్నానని తెలిపారు.రామ్ మందిరాన్ని నిర్మించడానికి దేశవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తున్నారని పవన్ అన్నారు. ఇది తన విరాళం అని ఆయన అన్నారు
'ధర్మానికి ప్రతిరూపమే శ్రీరామచంద్రుడు. సహనం, శాంతి, త్యాగం, శౌర్యం.. ఈ దేశం ఎలాంటి దాడులు, ఒడిదుడుగులు ఎదురైనా మన దేశం బలంగా నిలబడగలిగింది అంటే శ్రీరాముడు చూపిన మార్గమే. పరమత సహనం  మనదేశంలో ఉందంటే అది ఆయన చూపిన దారే.  అందుకే రామరాజ్యం అన్నారు. అన్ని మతాల వారు, ప్రాణకోటి సుఖంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో రామాలయం కడుతుంటే భారతీయులంతా పిల్లాపాపలంతా విరాళాలు ఇస్తున్నారు. నా వంతుగా రూ.30 లక్షలు ఇస్తున్నా.'' అని పవన్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: