మొటిమల సమస్యా.. ఇలా చేస్తే మటుమాయం..?

praveen
సాధారణంగా యుక్త వయసులో ఉన్న యువతీ యువకులు ఎక్కువ అందంగా కనిపించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.  అయితే దీని కోసం ఎన్నో రకాల క్రీమ్స్ లాంటివి కూడా వాడుతూ ఉంటారు. కానీ యుక్త వయసులో ఉన్న యువతీ యువకులు అందరూ కూడా మొటిమలు లాంటి సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు. కొంతమందిలో మొటిమల సమస్య కాస్త తక్కువగా ఉన్నప్పటికీ కొంతమందిలో మాత్రం ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. కేవలం ముఖం లోని ఒక భాగంలో కాకుండా ముఖం మొత్తం మొటిమలతో నిండిపోవడంతో వారి ఇబ్బందులు అన్ని ఇన్ని కావు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఇక మొటిమలను తగ్గించుకోవడం కోసం నేటి రోజుల్లో యువత చేస్తున్న ప్రయత్నాలు మాటల్లో చెప్పలేనివి  అనే చెప్పాలి. మొటిమలను తగ్గించుకోవడం కోసం ఉన్న అన్ని ప్రయత్నాలను చేస్తున్నారు. ఇక ఆ తర్వాత చివరికి ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు ఎంతో మంది యువతీ, యువకులు.  అయితే కొంతమందికి మొటిమలు మొఖానికి కాస్త అందాన్ని ఇచ్చినప్పటికీ చాలా మందికి మాత్రం మొటిమలు ముఖంలో అందాన్ని కనిపించకుండా చేస్తాయి అన్న విషయం తెలిసిందే. సాధారణంగా మొటిమలను తగ్గించుకోవడం మెడికల్ షాప్ లో ఉన్న అన్ని రకాల క్రీమ్స్ ని ప్రయత్నిస్తూ ఉంటారు యువత.

 అయితే మొటిమలను తగ్గించుకోవడం ఇక ఎన్నో ప్రయత్నాలు చేయడం కాదు. సహజసిద్ధంగానే మొటిమల సమస్యను తగ్గించవచ్చు అని చెబుతున్నారు వైద్యనిపుణులు. ఇక రోజు వారి ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మొటిమలను తగ్గించుకోవచ్చు అని చెబుతున్నారు. ముఖ్యంగా ఎనిమిది రకాల పండ్లు తినడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంది అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. యాపిల్స్, అరటి పండ్లు, బొప్పాయి, అవకాడో, నిమ్మ, రెడ్ గ్రేప్స్, చెర్రీస్ లాంటి 8 రకాల పండ్లు తినడం వల్ల మొటిమలు తగ్గే అవకాశం ఉందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: