మా ఇళ్ళు శ్రీ రాముడికే

Vasu
మా ఇళ్ళు శ్రీ రాముడికే

ఆలయానికి వెళితే హుండీలో నగదు, ఆభరణాలు వేస్తారు. కాని ఓ భక్తురాలు ఇంటినే రాసి ఇచ్చింది.
తమ ఇంటి దైవం జీడికల్ శ్రీరామచంద్ర స్వామికి ఒక భక్తురాలు తన ఇంటిని బహూకరించింది. బాండ్ పేపర్ పై సంతకం చేసి హుండీలో వేసింది. ఈ బాండ్ పేపర్ ను చూసిన ఆలయ ఈఓ వివరాలు సేకరిస్తున్నారు.
జనగామ జిల్లా జీడికల్ లో శ్రీరామచంద్ర స్వామి ఆలయం ఉంది. ఇటీవల ఆలయంలో జరిగిన బ్రహ్మోత్సవాలకు హైదరాబాద్ మాదన్నపేట కు చెందిన భక్తురాలు కె.లిఖిత దర్శనానికి వెళ్లింది
తను నివాసం ఉంటున్న (మాదన్నపేట ఇంటి నెంబర్ 17-2-870/9/1) ఇల్లును ఆలయానికి విరాళంగా ఇస్తున్నట్లు ఆమె బాండ్ పేపర్ తయారు చేసింది. తేదీ 22-02-2018 తో రూ.20 విలువ కల నాన్ జుడిషియల్ పేపర్ పైన ఆమె సంతకం చేసింది.
సాక్షిగా భర్త జానకీరామ్ సంతకం చేశారు. బ్రహ్మోత్సవాలు ముగియడంతో సోమవారం నాడు ఆలయ సిబ్బంది హుండీ తెరిచి లెక్కించి చూశారు. నగదు, ఆభరణాలతో పాటు బాండ్ పేపర్ కూడా కన్పించడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. ఆలయ శేషు భారతి వెంటనే పై స్థాయి అధికారులకు సమాచారం పంపించింది. హైదరాబాద్ లోని దేవాదాయ శాఖ అధికారులు ఆమె వివరాలు సేకరిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: