గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై అదిరిపోయే ఆఫర్.. డిస్కౌంట్ తో మరో గ్యాస్ సిలిండర్ కొనొచ్చు..?

praveen
ఈ మధ్యకాలంలో డిజిటల్ పేమెంట్ యాప్ లు ఎక్కువగా పెరిగి పోయాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏం చేయాలన్నా కూడా ప్రస్తుతం ఎన్నో రకాల ఆఫర్లు అందుబాటులో ఉంటున్నాయి.  ఇక వినియోగదారులను ఆకర్షించేందుకు ఎన్నోరకాల కార్యకలాపాలకు వివిధ రకాల ఆఫర్లు ప్రకటిస్తూ పలురకాల డిజిటల్ పేమెంట్ యాప్స్  ఎంతో మంది కస్టమర్లు ఆకర్షిస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై కూడా ఎన్నో రకాల ఆఫర్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై ఎంతో ఆకర్షణీయమైన క్యాష్బ్యాక్ ఆఫర్లు కూడా లభిస్తున్నాయి.

 ఇక ఈ క్యాష్బ్యాక్ పొందేందుకు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. కేవలం ఇంట్లోనే కూర్చుని మీ అర చేతిలో ఉన్న సెల్ఫోన్ నుంచి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారికి ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఒక అదిరిపోయే ఆఫర్ ను అందుబాటులో ఉంచింది.  ఇక అమెజాన్లో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడం ద్వారా ఎంతగానో క్యాష్బ్యాక్ లభిస్తుంది దీనికోసం మీరుఎంతో కష్టపడాల్సిన పనిలేదు అమెజాన్ లో కి వెళ్లి పే బిల్స్ అనే ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. ఇక ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ ఆప్షన్ తీసుకుని ఆపరేటర్ ను ఎంచుకుని రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే సరిపోతుంది.

 ఇందుకోసం మీకు 50 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. అయితే ఇది తొలిసారిగా సిలిండర్ బుక్ చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది.  మరో డిజిటల్ వాలెట్ సంస్థ పేటీఎంలో కూడా మరో అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది పేటీఎం ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే ఏకంగా 500 రూపాయల వరకు క్యాష్బ్యాక్ పొందేందుకు అవకాశం ఉంటుంది. పేటియం ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేయడం కోసం పేటీఎం లోకి వెళ్లి రీఛార్జ్ అండ్ పే బిల్స్  అనే ఆప్షన్ లోకి వెళ్లి సిలిండర్ బుక్ చేసుకోవాలి. ఇలా తొలిసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారికి ఐదు వందల రూపాయల వరకు క్యాష్బ్యాక్ లభిస్తోంది.  ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: