ఈ టీ తాగితే కరోనా రాదా...?

Gullapally Rajesh
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత చాలా వరకు ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కట్టడి విషయంలో చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఏపీ ఆయుష్ కమీషనర్ ఉష కుమారి కీలక విషయాలు వెల్లడించారు. కరోనా వ్యాధిని నివారించి, ప్రజల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు మరో విడత హోమియో మందులను అందరికి అందించాలని కేంద్రం పభుత్వాన్ని కోరాము అని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే రెండు లక్షల మందికిపైగా ఉచితంగా  "హోమియోపతి ఔషధం 'ఆర్సినికం ఆల్బమ్ 30'ను రోగనిరోధక శక్తిని పెంచే మందుగా అందించామన్నారు.
ఈ ఔషదం తీసుకున్న వారికి కరోనా వైరస్‌ సోకని విషయాన్ని గుర్తించాము అని  చెప్పారు. కోవిడ్ -19 నివారణ, నియంత్రణ, నిర్వహణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి అని ఆమె వెల్లడించారు. దేశానికి చాలా కాలం నుంచి సంప్రదాయ ఔషధ చరిత్ర ఉంది, ఆయుర్వేద రంగంలో దేశం ముందుంది అని అన్నారు. కరోనా సమయంలో సుగంద ద్రవ్యాలు, ఇతర నిత్యావసరాలతో తయారు చేసిన హెర్బల్‌ టీ మంచి ఫలితాన్ని ఇచ్చింది  అని వెల్లడించారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కరోనా తన దుష్ప్రభావాలను చూపిస్తున్నందున ఈ హెర్బల్‌ టీ వినియోగంపై ప్రజల్లో మరింత అవగాహన తీసుకొచ్చేందుకు వైద్యులు దృష్టి సారించాలి అని పేర్కొన్నారు.
క్లినికల్ అధ్యయనాలు, ఆయుష్ వ్యవస్థల సహకారం ద్వారా దేశంలో కోవిడ్ -19 మహమ్మారి సమస్యను పరిష్కరించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది అని ఆమె అన్నారు. ఆశ్వ గంధ, యష్టిమధు, గుడుచి + పిప్పళ్ళు.... ఆయుష్ – 64 లాంటి ఔషదాలు కరోనా వైరస్‌ రాకుండా రోగ నిరోధకశక్తి పెంపుదలలో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, సోవా, రిగ్పా, హోమియోపతిలో ప్రత్యామ్నాయ ఔషధాల వినియోగంపై వైద్యులతో చర్చించామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: