మళ్లీ కేంద్రం అదుపులో మెహబూబా ముఫ్తీ..?

yekalavya

శ్రీనగర్ : కేంద్ర ప్రభుత్వం తనను అనధికారికంగా బంధించిందని జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్ మెహబూబాముఫ్తీ ఆరోపిస్తున్నారు. చట్ట విరుద్ధంగా తనను, తన కుమార్తెను అదుపులోకితీసుకున్నారని, తన కుమార్తె ఇల్తిజాను ఏకంగా హౌజ్ అరెస్ట్ చేశారనిమండిపడ్డారు.


పుల్వామాలో ఉంటున్న పారావహీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి తాను వెళ్లాలనుకుంటున్నట్లు కేంద్రాన్ని కోరానని, కానీ 2 రోజులుగా కేంద్ర అనుమతించడం లేదని అన్నారు. తమను ఇలా అనధికారికంగా నిర్బంధిచి.. బీజేపీ, వారి తోలు బొమ్మలు మాత్రం రాష్ట్రంలో యథేచ్ఛగా తిరుగుతున్నాయని ఆగ్రహంవ్యక్తం చేశారు.


 కేవలం తన విషయంలో, కాశ్మీర్‌కు చెందిన తనలాంటి వారి విషయంలోనే కేంద్రానికి భద్రత గుర్తొస్తోందని విరుచుకుపడ్డారు. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ నవీద్ బాబుతో సంబంధాలున్నాయంటూ పీడీపీ యువజన విభాగం
అధ్యక్షుడు వహీద్ పర్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై టెర్రర్ కేసు నమోదు చేశారు.


ఇదిలా ఉంటే ఆర్టికల్ గతేడాది ఆగస్టు 4న మెహబూబా ముఫ్తీని కేంద్రం అదుపులోకి తీసుకుంది. ఆమెను హౌస్ అరెస్ట్ చేసింది. 370 ఆర్టికల్ రద్దు నేపథ్యంలో మెహబూబాతో పాటు ఉమర్ అబ్దుల్లా వంటి పలువురు కీలక నేతలను సైతం
కేంద్ర బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అయితే అక్టోబరు 13, మంగళవారం ముఫ్తీని కేంద్ర బలగాలు విడుదల చేశాయి. ఈ విషయాన్ని జమ్ముకశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధి రోహిత్ కన్సల్ స్వయంగా వెల్లడించారు.


అప్పటి నుంచి ఇతర పార్టీలతో చర్చలు జరిపిన ముఫ్తీ ఆయా పార్టీలతో కూటమిగా ఏర్పడ్డారు. త్వరలో జమ్మూ-కాశ్మీర్‌లో జరగనున్న ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసి బీజేపీని ఓడించాలని ఆమె ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను కూడా ప్రారంభించేశారు. అయితే తమ ప్రచార కార్యక్రమాలను కేంద్ర అడ్డుకుంటోందని, అందులో భాగంగానే తమను అనధికారికంగా నిర్బంధిస్తోందని ముఫ్తీ ఆరోపిస్తున్నారు. మరి దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: