సడన్ ఎంట్రీ ఇచ్చిన టీడీపీ సీనియర్...బాబుకు షాక్ ఇచ్చేలా!

M N Amaleswara rao
2019 ఎన్నికల్లో జగన్ దెబ్బకు టీడీపీలోని మహామహులు ఓటమి పాలైన విషయం తెలిసిందే. వైసీపీ వేవ్‌లో టీడీపీ సీనియర్లు సైతం ఘోరంగా ఓడిపోయారు. అయితే ఓడిపోయాక చాలామంది నేతలు సైలెంట్ అయిపోయారు. మరికొందరు నేతలు పార్టీలు మారిపోయారు. ఇక కేంద్ర మాజీ మంత్రి సూర్యప్రకాశ్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సైతం సైలెంట్‌గానే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో సుధీర్ఘ కాలం పాటు రాజకీయాలు చేసిన కోట్ల, 2019 ఎన్నికల ముందు టీడీపీలో చేరారు.
అలాగే కర్నూలు ఎంపీగా పోటీ చేశారు. కానీ జగన్ వేవ్‌లో ఆయన చిత్తుగా ఓడిపోయారు. ఓడిపోయాక పెద్దగా పార్టీ తరుపున కార్యక్రమాలు చేయలేదు. ఏదో అప్పుడప్పుడు మీడియా ముందు మాట్లాడటం తప్పా. పైగా ఈయన ఫ్యామిలీతో సహ పార్టీ మారిపోతారని చాలా వార్తలు వచ్చాయి. కాకపోతే కోట్ల మాత్రం పార్టీ మారలేదు. అలా అని పార్టీలో యాక్టివ్‌గా లేరు. దీంతో టీడీపీ శ్రేణులు సైతం పార్టీ మారిపోతారని భావించారు.
అయితే ఇప్పుడు కోట్ల సడన్ ఎంట్రీ ఇచ్చి, జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం రూ.250 కోట్లు ఖర్చు చేసి తుంగభద్ర పుష్కరాలు నిర్వహిస్తోందని, అయితే కరోనా పేరుతో నది స్నానం లేకుండా పోలీసులు, అధికారులు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ఉన్న అనుమతి.. ఏపీలో ఎందుకు లేదని ప్రశ్నించారు. అలాగే వైసీపీ ప్రభుత్వం హిందుత్వాన్ని కాలరాస్తోందని, ఇక గుండ్రేవు ఎత్తిపోతల పథకం కోసం రైతులతో కలిసి జనవరిలో పాదయాత్ర చేస్తామని కోట్ల తెలిపారు.
ఇలా కోట్ల సడన్ ఎంట్రీ ఇచ్చి సొంత పార్టీనే షాక్ అయ్యేలా జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అలాగే గుండ్రేవు ప్రాజెక్టు కోసం డైరక్ట్‌గా రంగంలోకి దిగి జగన్ ప్రభుత్వంపై పోరాడటానికి సిద్ధమవుతున్నారు. అంటే కోట్ల పార్టీ మారరు అని అర్ధమవుతుంది. పైగా చంద్రబాబు ఇటీవల కోట్లకు జాతీయ ఉపాధ్యక్ష పదవి కూడా ఇచ్చారు. అయితే టీడీపీలో పదవుల పంపకం జరిగాక చాలామంది నేతలు యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: