ఉత్తరప్రదేశ్ లో దారుణం. టపాసులు కాల్చుతూ ఎంపీ మనుమరాలు మృతి

Malathiputhra
దీపావళి పండగ పూట అపశృతులు చోటుచేసుంటున్నాయి ... ఈ  మధ్య చూస్తే ఈ దీపావళికి ఎన్నడూ లేని విధంగా ఎక్కువ మరణాలు  సంభవించడం విశేషం ... రాష్ట్రాలు బాణాసంచాని నిషేదించిన ప్రజలు బాణాసంచాలి కాల్చారు ... కాలిస్తే మంచిదే కానీ ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా బాణాసంచాని కాల్చడం వాళ్ళ ప్రజలు ప్రాణాలను  పోగొట్టుకుంటున్నారు ..ఇది అత్యంత బాధాకరమైన విషయం ... మొన్న రెండు తెలుగు రాష్ట్రాలలో దీపావళి పండగ పూట బాణాసంచా కాలుస్తూ కొందరు  మరణించిన సంఘటనలు  మనం చూసాము
తాజాగా ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది .. అది కూడా ఒక ఎంపీ గారి ఇంట్లో .. వివరాలలోకి వెళ్తే
ఉత్తరప్రదేశ్ కి చెందిన ఎంపీ రీటా బహుగుణా జోషి ఇంట్లో టపాసులు కాల్చుతూ మనుమరాలు మృతి చెందిన ఘటన వారి ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపింది ...
దీపావళి పండగ సందర్బంగా అందరు టపాసులు కాల్చుతుంటారు .. అయితే రీటా బహుగుణా జోషి ఇంట్లో కూడా దీపావళి పండగని జరిపారు.. అందులో భాగంగా రీటా మనుమరాలు టపాసులు కాల్చుతుండగా ప్రమాదానికి గురైయ్యింది .టపాసు నుండి మంటలు  చెలరేగడం తో అవి ఆమె  శరీరాన్ని చుట్టుముట్టాయి .. గమనించిన స్థానికులు వెంటనే ఆమెని హాస్పిటల్ కి  తరలించారు .. హాస్పిటల్ కి చేరుకునేసరికి ఆమె శరీరం 60  శాతం కాలిపోయింది .. పరిస్థితిని గమనించిన వైద్యులు ఆమెని ఢిల్లీకి తరలించారు ..
ఢిల్లీ లోని మిలిటరీ హాస్పిటల్ కి చేరిన బాలిక అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందింది ..తన మనవరాలికి  మెరుగైన చికిత్స ని అందించాలని రీటా బహుగుణా మంత్రులకు మరియు యూపీ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసిన మనవరాలి  ప్రాణం నిలువలేదు ... తన మనవరాలి మరణంతో రీటా భాగోద్వేగానికి గురైయ్యింది .. పండగ పూట ఇలాంటి మాట వినవలసి వస్తుందని అనుకోలేదని కుటుంబమంతా  శోకసంద్రంలో మునిగిపోయింది ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: