పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత.. భారత యుద్ధ విమానాలు సిద్ధం..?

praveen
ప్రస్తుతం భారత్ పాకిస్థాన్ సరిహద్దు ల్లో ఉద్రిక్త పరిస్థితులు అంతకంతకూ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగ లో తొక్కి భారత్పై పాకిస్థాన్ కాల్పుల కు దిగడంతో ఏకంగా ఐదుగురు సైనికులు వీర మరణం చెందారు. వెంటనే స్పందించిన భారత సైన్యం దీటు గా పాకిస్తాన్ పై దాడికి దిగి పాకిస్థాన్ సరిహద్దు ల్లో కి ఐదు కిలో మీటర్ల వరకు దూసుకెళ్లి పాకిస్తాన్ సైనికులు అందరిని ఏకంగా  పరుగులు పెట్టించి మరి కాల్చి చంపింది భారత సైన్యం. అదే సమయం లో ఉగ్రవాదుల లాంచ్ పాడ్ లను  కూడా ధ్వంసం చేస్తూ విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే.


 ఇదే సమయం లో పాకిస్థాన్ వూహించని విధంగా మును పెన్నడూ లేని విధంగా ఏకంగా పాకిస్థాన్పై మిస్సైల్స్ ప్రయోగించి భారీ గానే బుద్ధి చెప్పింది భారత్. ఈ క్రమంలో నే పాకిస్తాన్ భారీగా నష్టపోతున్న విషయం తెలిసిందే.  దీంతో మరింత అప్రమత్తం అయిన పాకిస్తాన్ సరిహద్దు లోకి యుద్ధ ట్యాంకుల ను మోహరించడం తో పాటు యుద్ధ విమానాలు మొహరించేందుకు కూడా ప్రయత్నించింది. ఇలాంటి పరిణామాల నేపథ్యం లో అటు భారత్ కూడా ఎంతో వ్యూహాత్మకం గా వ్యవహరించింది.

 పాకిస్థాన్ తమ సరిహద్దు ల్లో యుద్ధ విమానాల ను మోహరిస్తుంది అని భారత్ గ్రహించి వెంటనే తేజస్ యుద్ధ విమానాలను భారత్ పాకిస్తాన్ సరిహద్దు లో మొహరించేందుకు సిద్ధమైంది. భారత సరిహద్దుల్లో తేజస్ యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక అదే సమయంలో రఫెల్ కూడా అంబాల ఏర్పోర్ట్ లోనే ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా భారత్ సిద్ధంగా ఉంది అనే సంకేతాన్ని పాకిస్థాన్కు ఇవ్వడంతోనే పాకిస్తాన్ యుద్ధ విమానాలను సరిహద్దుల నుంచి వెనక్కి పంపించింది అనే టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: