ఇలా సెల్ఫీ తీసుకుంటే ప్రాణమే పోయింది... ఏం జరిగిందంటే...?

Suma Kallamadi
ఇప్పటి కాలంలో ఫొటోలకి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. మొబైల్స్ కు ఫ్రంట్ కెమెరా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఫోటోలు దిగడం.... వాటిని అప్లోడ్ చెయ్యడం ఇదే పని. ఇది అంత ఒకటైతే.... ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లి వాళ్ళు అజాగ్రత్త తో తమ ప్రాణాల మీదకే తెచ్చుకోవడం కూడా జరుగుతోంది. వీటిని ఆపడం ఎవరి తరము కావడం లేదు. దూర ప్రాంతాలకు వెళ్లి ప్రమాదకరమైన ఫీట్లను చేసి ప్రాణాలు కోల్పోతున్నారు.ఇప్పుడు తాజాగా ఇటువంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది.  నోయిడా లో ఒక వ్యక్తి పిస్తోల్ తో సెల్ఫీ కి ఫోజులు ఇచ్చింది...... అనుకోకుండా ఆ పిస్తోల్ పేలడం తో అతడి ప్రాణాలు పోయాయి. ఎంత దారుణమో కదా...!
ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే... ఢిల్లీ కి సమీపం లో ఉన్న నోయిడా లోని ఖేదా దర్పురా గ్రామానికి చెందిన సౌరభ్(22) ఆదివారం ప్రమాదకర స్థితిలో చనిపోయాడు. చేతి లో పిస్తోల్  పట్టుకుని సెల్ఫీ తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. పిస్తోల్ లో బుల్లెట్ లు లేవనుకున్న సౌరభ్.. దానిని పాయింట్ బ్లాంక్ లో పెట్టుకుని కాల్చుకుంటున్నట్టు ఫోటో దిగబోయాడు. ఇంకేం ఉంది బుల్లెట్ సరాసరి సౌరభ్ ఛాతిలోకి దూసుకెళ్లింది.
అదే సమయం లో అక్కడకు తన స్నేహితుడు నకుల్ వచ్చాడు. వెంటనే అతడు సౌరభ్ ను ఆస్పత్రికి తరలించాడు. కానీ ప్రయోజనం లేక పోయింది. బుల్లెట్ ఛాతిలో దిగడం వల్ల అతడు శ్వాస కోల్పోయాడని వైద్యులు తెలిపారు. సెల్ఫీ పై  మోజు ప్రాణాన్నే తీసింది. గతం లోనూ ఇలాంటి తరహా మరణాలు పలుమార్లు సంభవించినా.. యువతలో మార్పు రావడం బాధాకరమని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదకర వంతెనలు, ఎత్తైన కొండల వంటి ప్రాంతాలకెళ్లే ఫోటోలు తీసుకుని దారుణంగా చనిపోతున్నారు అని అన్నారు.
 

 
  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: