గ్రేటర్ లో టీఆర్ఎస్ ని నిలువరించేందుకు అస్త్రం తయారు చేసిన బీజేపీ..?

P.Nishanth Kumar
బీజేపీ పార్టీ తెలంగాణ లో అంచలంచెలుగా ఎదుగుతుంది అని చెప్పడానికి ఉదాహరణ నాలుగు ఎంపీ సీట్లే కాదు, జనాల మద్దతు కూడా అని చెప్పాలి..దుబ్బాక లో అధికార పార్టీ ని నిలువరించింది అంటే బీజేపీ ఏ రేంజ్ లో ఇక్కడ ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు.. ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ని సైతం పక్కన పెట్టి బీజేపీ కేసీఆర్ ని విమర్శించడం వారి తప్పులను ఎత్తి చూపడంతో బీజేపీ కి ప్రజల మద్దతు దక్కుతుంది.  ఇప్పటికే దుబ్బాక లో ఓట్లను చీల్చడంలో బీజేపీ ప్రముఖ పాత్ర వహించి అధికార పార్టీ ని దెబ్బ తీసే విధంగా  చేసింది. కాగా ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో కూడా అధికార టీఆరెస్ పార్టీ ని నిలువరించేందుకు ఓ కొత్త అస్త్రాన్ని తయారు చేసింది బీజేపీ.
నిజానికి గత గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరుగులేని విజయం సాధించడానికి డబుల్ బెడ్ రూం ఇళ్లే కారణం. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రజలకు ఇస్తామని సరికి ప్రజలు అందరు టీఆరెస్ వైపు తలొగ్గారు..  తలసాని శ్రీనివాస్ యాదవ్ నియోజకవర్గంలో కొన్ని డబుల్ బెడ్ రూం ఇళ్లను హుటాహుటిన నిర్మించిన ప్రభుత్వం వాటిని చూపించి.. గ్రేటర్‌లో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దాంతో తమకు కూడా వస్తాయని ఆశపడ్డారు.  అలాంటి ఇళ్లు లక్ష కట్టిపేదలకు ఇస్తామని చెప్పింది. దాదాపుగా ప్రతీ ఇంటి నుంచి దరఖాస్తు తీసుకుంది. అలా దరఖాస్తు ఇచ్చిన వారందరూ టీఆర్ఎస్‌కు ఆశతో ఓటు వేశారు. కానీ ఇప్పటికి ఏడేండ్లు గడిచాయి.
లక్ష బెడ్ రూం ఇళ్లు మాత్రం కనిపించడం లేదు. ఎన్ని కట్టారో స్పష్టత ఇవ్వడం లేదు. అయితే ఇటీవలే దానిపై అసెంబ్లీ లో చర్చ జరిగిన దాన్ని నిరూపించుకోవడంలో టీఆరెస్ పార్టీ విఫలమయ్యింది అని చెప్పాలి.. దీన్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లి తమకు అణులంగా మార్చుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. ఇదే హామీని తాము తీర్చేవిధంగా డబుల్ బెడ్ రూమ్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తుంది..తెలంగాణలో కేసీఆర్ ఇస్తామని చెబుతున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిధులన్నీ కేంద్రానివేనని ప్రచారం మాత్రం చేస్తున్నారు. కేసీఆర్ ఖర్చు చేస్తున్న ప్రతీరూపాయి.. కేంద్రం ఇస్తున్నదేనని.. కేంద్రంలో ఉన్న తమ పార్టీ అధికారాన్ని విస్తృతంగా ఉపయోగించుకుని ప్రచారం చేస్తున్నారు. మరి ప్రజలు దేన్నీ నమ్ముతారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: