లోకేష్ కు ఒకటి కాదు రెండు ? బాబు స్కెచ్ అదిరింది !

కింద పడ్డా పై చేయి తనదే అన్నట్టుగా, రాజకీయం చేస్తున్నారు టిడిపి అధినేత చంద్రబాబు. బాబు స్థాయిలో రాజకీయాలను కాచి వడబోసిన వారు మరొకరు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుత వ్యవహారం చూసుకుంటే, వైసీపీ ప్రభుత్వానికి ఎంత మెజారిటీ ఉన్నా, టిడిపి ఎంతటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న నిత్యం ఏదో ఒక అంశంపై టిడిపి ఆందోళన నిర్వహిస్తునే వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా తయారయింది. ప్రతి దశలోనూ వైసీపీ దూకుడు టిడిపి రాజకీయం జగన్ కు సైతం ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం చంద్రబాబు వయసు రీత్యా మరెంతోకాలం యాక్టివ్ గా ఉండే పరిస్థితి లేదు. ఈ విషయం లో అందరి కంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు . తన కుమారుడు లోకేష్ తన స్థాయికి తగ్గ వ్యక్తిగా మార్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. 


అయితే ప్రజాక్షేత్రంలో గెలవలేని మచ్చ ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేష్ వైసీపీ కి చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఐదు వేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అప్పటి నుంచి వైసీపీ చేతిలో అవమానాలకు గురవుతూ వస్తున్నారు. గత టిడిపి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ గా ఉన్నారు. కానీ ఎమ్మెల్యే కాలేకపోయాను అనే బాధ లోకేష్ లో ఉంది. ఇది ఇలా ఉంటే 2024 ఎన్నికల్లో గెలిచి తన సత్తా చాటుకోవాలని లోకేష్ ఇప్పటి నుంచో జనాల్లో బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు . అయితే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయం పైన ఉత్కంఠ నెలకొంది.


 వచ్చే ఎన్నికల్లో లోకేష్ ను ఈ రెండు నియోజకవర్గాల నుంచి పోటీకి దిగుతారని ఒక నియోజకవర్గం ఓటమి చెందినా, మరో నియోజకవర్గం విజయం  విజయం దక్కుతుందని లెక్కల్లో బాబు ఉన్నారట. ఈ మేరకు మంగళగిరి కానీ, లేక, గుంటూరు జిల్లాలోని కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే నియోజకవర్గం నుంచి లోకేష్ పోటీకి దింపాలని చూస్తున్నారు. అలాగే అనంతపురం జిల్లాలో టీడీపీకి బాగా పడుతుంది హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీకి దింపితే లోకేష్ ఎమ్మెల్యే గా విజయం సాధిస్తారని బాబు నమ్ముతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: