విషాదం.. ప్రాణం తీసిన ఈఎంఐ.. ఎక్కడంటే?

Satvika
కరోనా ఎంత పని చేసిందంటే అందరూ కన్నీరు పెట్టుకుంటారు.ఎందుకంటే ఏడు నెలలు ఎటూ కదల్లేని పరిస్థితి ఎదురైంది. కరోనా సోకకుండా ఉండాలంటే ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం సూచించడంతో ప్రజలు అనేక నరకాన్ని కళ్ళముందు చూసారు. రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలకు ఈ పరిస్థితి మాత్రం అత్యంత క్రుంగదీసింది..జీతాలు లేక జీవితం సాగించలేక.. కరోనా ఎక్కడ సోకుతుంది అనే భయంతో  ముందుగానే చాలా మంది ప్రాణాలను కోల్పోయారు. కొందరు కరోనా సోకడంతో ప్రాణాలతో పోరాడుతున్నారు.


కొందరు తీసుకున్న లోన్లకు ఈఎంఐ లు కట్టలేక ప్రాణాలను కోల్పోతున్నారు.. అలాంటి ఘటనే ఇప్పుడు వెలుగు చూసింది.. వివరాల్లోకి వెళితే.. అసోంలోని కోక్రాజర్ జిల్లాలో  ఈ దారుణ ఘటన వెలుగు చూసింది.. నిర్మల్ పాల్ అనే వ్యక్తి గౌహతి సమీపంలో గ్యాస్‌ సబ్‌ ఏజెన్సీని నిర్వహిస్తున్నాడు. తన వ్యాపారం కోసం బ్యాంకులు, తెలిసిన వారి దగ్గర నుంచి రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు అప్పులు చేశాడు. కరోనా వల్ల ఎక్కడిక్కడ బందోబస్తు అవ్వడంతో తీవ్ర నష్టాలను చూసాడు.. గత కొన్ని నెలలుగా రుణ వాయిదాలను చెల్లించలేదు. నెలలు గడిచేకొద్ది అవన్నీ తలకు మించిన భారమయ్యాయి. దీంతో పాటు బ్యాంకులు, అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగింది.


ఈ నేపథ్యంలో ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.అయితే విషం తాగి కుటుంబంలోని ఐదుగురు ప్రాణాలను తీసుకున్నారు. బ్యాంకుల ఒత్తిడి వల్ల అలా చేశారని తెలుస్తుంది. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.. అప్పులు భరించలేక చనిపోయారని పోలీసులు గుర్తించారు. కాగా, తన పెద్ద కుమార్తె ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. మిగిలిన ఇద్దరు కూతుళ్లు తమ విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై నిర్మల్ పాల్ బంధువులు, అఖిల అసోం బెంగాలీ యువ విద్యార్థి సంఘం కోక్రాజర్ విభాగం సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ కుటుంబం మరణాల వెనుక ఏదో కారణం ఉందన్నారు.. ఈ కేసును లోతుగా పరిశీలించాలని పోలీసులను కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: