స్నానం చేయకండి.. కేవలం నీళ్లు చల్లుకోండి సరిపోతుంది.. ప్రభుత్వం ఆదేశాలు..?

praveen
ప్రస్తుతం భారతదేశం లో కరోనా  వైరస్ ప్రభావం రోజు రోజుకు పెరిగిపోతున్న తరుణం లో ప్రజలందరూ అన్ని రకాల కార్యకలాపాలకు దూరం అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దేశంలో ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగలు కరోనా వైరస్ కారణంగా సాదాసీదాగానే జరుపుకోవాల్సి వచ్చింది. ఇలా ప్రతీ విషయంలో కూడా కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇంటికే పరిమితమై  అన్ని  కార్యకలాపాలు జరుపుకోవాల్సి వస్తుంది దేశ ప్రజానీకం. ఇక రానున్న రోజుల్లో కూడా అన్ని ముఖ్య దినాలపై   కూడా కరోనా వైరస్ ప్రభావం పడుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా పుష్కరాల పై కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా పడే అవకాశం ఉంది.

సాధారణంగా తెలుగు రాష్ట్రాలలో వచ్చే పుష్కరాలకు ఎంతో మంది ప్రజలు అక్కడికి చేరుకొని పుష్కరాలలో స్నానం చేయడం ద్వారా ఎంతో శుభం కలుగుతుంది అని నమ్ముతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. లక్షల మంది ప్రజలు పుష్కరాలకు చేరుకొని స్నానాలు ఆచరించి తమ పాపాలను కడిగేసుకోవాలని భావిస్తూ ఉంటారు. పుష్కరాలు వచ్చిన ప్రతి సారి కూడా లక్షల సంఖ్యలో భక్తులు పుష్కరాలలో స్నానం చేసేందుకు వస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 కానీ ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఇలాంటి అవకాశం మాత్రం భక్తులకు  లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నవంబర్ 20 తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఏపీ ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది, భక్తులందరూ ఇంటి వద్ద స్నానాలు చేసి వచ్చి నది వద్దకు చేరి పుష్కర నీటిని కేవలం తలపై చల్లుకోవాలి అంటూ నిబంధన పెట్టింది. పితృదేవతలకు పిండప్రదానం అంలాంటి టే కార్యక్రమాలు కేవలం ఏకాంతంగా నిర్వహించుకోవాలి అంటూ సూచించింది. వైరస్ లక్షణాలు ఉన్న భక్తులు స్వచ్ఛందంగా వెనక్కి వెళ్ళాలి అంటు సూచించింది ఏపీ ఆరోగ్యశాఖ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: