ఈ విచిత్రమైన చేపను కనిపెట్టింది ఎవరో తెలుసా?

Kothuru Ram Kumar
మార్కెట్ లోకి కొత్తరకం చేప వచ్చింది. తినడానికి పనికి వస్తుందో తెలీదో గాని, చూడ్డానికి మాత్రం మంచి అందంగా వుంది. ఇమేజ్ లో మీరు కూడా చూడవచ్చు. దీన్ని తాజాగా.. పశ్చిమ కనుమలు శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇది స్కిస్తురా జాతికి చెందినదిగా వారు చెప్తున్నారు. కాగా ఈ చేపలు చాలా అరుదుగా కనిపిస్తాయి. చాలా అందంగా, బంగారపు రంగులో పైన కొద్దిగా వెంట్రుకలు కలిగి చాలా ముద్దు ముద్దుగా ఉంటాయి.
ఇక ఇవి ఆక్సిజన్‌ శాతం ఎక్కువగా ఉండే మంచి నీటి చెరువులలోనే ఎక్కువగా కనిపిస్తాయని చెప్తున్నారు. ఇక దీన్ని కనిపెట్టే క్రమంలో మహారాష్ట్ర సీఎం అయినటువంటి ఉద్ధవ్‌ థాక్రే తనయుడు తేజస్‌ థాక్రే పాత్ర వుంది. ఐసీఏఆర్‌ ఇన్‌స్టిట్యూట్‌ కి చెందిన జయసింహన్‌ ప్రవీణ్‌రాజ్‌, అండన్‌ వాటర్‌ ఫోటోగ్రాఫర్‌ అయినటువంటి శంకర్‌ బాలసుబ్రహ్మణ్యన్‌, తేజస్ థాక్రే కలిసి పశ్చిమ కనుమలలో ఈ చేపను కనుగొన్నారు.
ఇకపోతే, దీనికి వారు ‘స్కిస్తురా హిరణ్యాక్షి’ అని నామ కరణం చేశారు. దీనికి వివరణగా... ఇది హిరణ్యాక్షి అనే నదిలో దొరకడం వలన దీనికి ఈ పేరు పెట్టడం జరిగిందని పేర్కొన్నారు. కాగా.. దీనికి సంబంధించిన వివరాలను వారు ఆక్వా ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఇక్తాలజీలో ప్రచురించడం వలన తాజాగా వెలుగు చూసింది. హిరణ్యాక్షి అంటే బంగారపు రంగు జుట్టు కలది అనే అర్థం. అందువలన దీనికి ‘స్కిస్తురా హిరణ్యాక్షి’ అనే పేరు పెట్టారు.
కాగా.. ఈ చేపను తేజస్ ‌థాక్రే 2012 లోనే కనుగొన్నారని ప్రవీణ్‌ రాజ్‌ చెప్పడం కొసమెరుపు. దాని తరువాత 2017 లో ఈ జాతికి సంబంధించిన మరిన్ని చేపలను వారు అక్కడ కనుగొన్నట్లు ప్రవీణ్‌ చెప్పుకొచ్చారు. తరువాతి కాలంలో ఈ జాతి చేపల మీద మరింత రీసెర్చ్ చేసి విలువైన సమాచారాన్ని వారు ప్రచురించారు. కాగా ఈ చేపలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. మార్కెట్లోకి వస్తే కొనుక్కొని తినేద్దామని చాలా మంది భోజన ప్రియులు వెయిట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: