కట్నం కోసం భార్యను అతి కిరాతకంగా హింసించిన భర్త, మామ.. అరెస్టు చేసిన పోలీసులు

Suma Kallamadi
మహిళలపై అత్తవారింటి వేధింపులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ధన దాహం తీరని కొందరు మృగాళ్లు ఆడబిడ్డలను అతికిరాతకంగా వేధిస్తున్నారు. భారతదేశంలో వరకట్న వేధింపులు ఇప్పటికే అత్యధికంగా పెరిగిపోయాయి. ఇటీవల చేసిన సర్వేల్లో కూడా అత్తింటి వారి కారణంగా ఎంతోమంది వివాహితులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారని బట్టబయలైంది.

తాజాగా గ్రేటర్ నోయిడా లో ఒక నీచపు భర్త తన భార్యను కట్నం తేవాలని అతికిరాతకంగా వేధించాడు. ఆమెను తన మామయ్య కూడా అత్యంత కిరాతకంగా వేధించడం ప్రారంభించడంతో పరిస్థితి దయనీయంగా మారింది. భర్త మామా ఇద్దరు కలిసి ఐదు లక్షల కట్నం తెస్తే కానీ వేధింపులు తప్పవు అంటూ ఆమె శరీరాన్ని సిగరెట్లతో అతికిరాతకంగా కాల్చారు. ఆ బాధ భరించలేక ఆ వివాహిత గుండెలు పగిలేలా రోదించింది. కానీ భర్త మామ మాత్రం ఆమెను ఇంకా వేధించడం మొదలు పెట్టారు. ఈ వివాహిత సంతానలేమి సమస్యతో బాధ పడటం బాధపడుతుండటంతో పిల్లలు కనలేదని కూడా ఆమెను బాగా హింసించేవాడు భర్త. అవన్నీ తట్టుకుని ఆ వివాహిత తన భర్తతోనే ఉండిపోయింది. అయితే ఇటీవల ఆమెపై ఆత్మహత్యాయత్నానికి తెగబడ్డారు అత్తింటివారు. ఈ విషయం కాస్తా వరకట్న వేధింపుల బాధితురాలి తల్లిదండ్రులకు తెలియడంతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చి ఆమెను ఆస్పత్రికి తరలించారు.

అలాగే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో... మహిళ భర్తతో సహా 6 మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.  పోలీసులు కట్నం వేధింపు, హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దారుణమైన కేసు జార్చా పరిధిలోని సిలార్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాలు తెలుసుకుంటే దాద్రి ప్రాంతంలోని బీల్ అక్బర్పూర్ గ్రామానికి చెందిన శివానీ.. లోకేశ్ శర్మ కుమారుడు రాజీవ్ ను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకుంది.  బాధితురాలి అత్తమామలు స్కార్పియో కారు కోసం రూ .5 లక్షలను కట్నం ఇవ్వాలని ప్రతిరోజు డిమాండ్ చేసేవారు. కానీ తమ తల్లిదండ్రుల దగ్గర అంత డబ్బు లేదని బాధితురాలు, చెప్పినప్పటికీ ఆమె మాటలు పట్టించుకోకుండా బాగా వేధించేవారు.  తన భర్త, మామ తనను బలవంతంగా బెల్ట్‌తో కొట్టేవారని బాధితురాలు తెలిపింది. భర్తకి మనస్సు బాగోలేనప్పుడు లేనప్పుడు భార్యని బీడీ, సిగరెట్‌తో కూడా కాల్చేవాడట. డీసీపీ రాజేష్ సింగ్ మాట్లాడుతూ నిందితులపై కేసు నమోదు చేశామని దర్యాప్తు చేస్తున్నామని మీడియాకు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: