చంద్రబాబు ప్రియమైన నేత..రాజకీయాల్లోంచి తప్పుకున్నట్లేనా..?

P.Nishanth Kumar
చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు లో చంద్రబాబు కు ప్రియమైన నేతగా  బొజ్జల గోపాల కృష్ణారెడ్డి  అక్కడ వరుసగా గెలుస్తూ వస్తున్నారు.. శ్రీకాళహస్తి నియోజక వర్గంలో అయన వరుసగా ఐదు సార్లు గెలవడంతో టీడీపీ కంచుకోటగా శ్రీకాళహస్తి ని మార్చారు.. 1989 నుంచి 1999 వరకు టీడీపీ తరపున గెలిచిన ఆయన 2004 లో దారుణంగా ఓడిపోయారు. ఆ తర్వాత 2009 , 2014 విజయదుందుఖి మోగించారు. ఒకవిధంగా నిన్నా మొన్నటి వరకు శ్రీకాళహస్తి gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల పేరు ఎక్కువగా వినిపించింది..

ఓ సారి gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల కు అనారోగ్య కారణంగా ఆయనకు ఇచ్చిన మంత్రి పదవిని మధ్యలోనే చంద్రబాబు తీసేయగా ఆయన అలకపాన్పు పై కూర్చున్నారు.. అనారోగ్య కారణంగా మంత్రి పదవి నుంచి తీసేశాం అని చెప్పగా అనారోగ్యం తో ఉన్నప్పుడు ఎమ్మెల్యే పదవి సైతం ఎందుకు రాజీనామా చేస్తానని చెప్పగా చంద్రబాబు నచ్చచెప్పి ఆయనను ఎమ్మెల్యే గా కొనసాగించేలా చేశారు.. ఈ వ్యవహారంతో బాబు కు gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల కు మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది..

ఇక 2019 ఎన్నికల్లో అన్ని నియోజక వర్గాలాగే టీడీపీ జెండా అక్కడ చిన్నబోయింది.  బొజ్జల కొడుకు gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల సుధీర్ రెడ్డి ఇక్కడ రాజకీయ ప్రవేశం చేయగా ఆయన జగన్ మేనియా లో అత్యంత దారుణంగా ఓడిపోయారు..  ఈ ఓటమితో కృంగిపోయిన సుధీర్ హైదరాబాద్ ను వదిలి రావడం లేదట. కరోనా సమయంలోనో నియోజక వర్గ ప్రజలకు అండగా ఉండలేదు.. ఓ వైపు చంద్రబాబు ఎంత మొత్తుకున్నా అందరు టీడీపీ నేతల్లాగే ఇతను బయటకు రావట్లేదట.. దాంతో శ్రీకాళహస్తి లో మరో ప్రత్యామ్నాయ లీడర్ కోసం చూస్తే అక్కడ వేరేవారు అంత యాక్టివ్ గా కనిపించట్లేదట.. దీంతో సుధీర్ రెడ్డి తిరిగి వచ్చే ఉద్దేశ్యం లేకపోవడంతో ఇప్పటిలో టీడీపీ ఇక్క ఒక లీడర్ ని తాయారు చేయడం అంటే సాధ్యం కానీ పని. ఈ దెబ్బతో టీడీపీ కంచుకోటగా ఉన్న ఈ నియోజక వర్గం కూడా గోవిందా గోవిందా అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: