ఆ రాష్ట్రంలో రెండో రాజధాని డిమాండ్.. !

NAGARJUNA NAKKA
దేశం మొత్తం ఓ ఎత్తు అయితే తమ రాజకీయాలు మాత్రం ఓ ఎత్తు అంటారు తమిళ తంబీలు. ఎక్కడా లేని విభిన్న రాజకీయం వారి సొంతం. అధికార పార్టీ అన్నాడీఎంకే రెండు రాజధానుల పాట పాడుతోంది. రెండో రాష్ట్రమే చేద్దామని మరో పార్టీ అంటోంది. ఎన్నికల్లో ఈజీగా గెలిచేయొచ్చనుకున్న డీఎంకేకు.. రెండు రాజధానుల ప్రతిపాదన ఇబ్బందికరంగా మారినట్టు కనిపిస్తోంది. మరి తంబీల కొత్త రాజకీయం ఎటు దారితీస్తుందోననే చర్చ జరుగుతోంది.
ప్రాంతాల మధ్య పోటీ పెట్టి విభజన రాజకీయం చేస్తే తిరుగుండదనే ఫార్ములా తమిళనాడు రాజకీయ పార్టీలను కూడా ఆకట్టుకున్నట్లుగా ఉంది. ఏపీలో పరిస్థితులు చూశారేమో కానీ.. తమిళనాడులో కూడా రెండో రాజధాని డిమాండ్ ఊపందుకుంది. మధురై కేంద్రంగా రెండో రాజధాని ఏర్పాటు చేయాలనే నినాదాన్ని మంత్రిగా ఉన్న ఉదయ్ కుమార్ వినిపించడం ప్రారంభించారు. మరో వైపు తిరుచ్చిని రెండో రాజధానిగా ఏర్పాటు చేయాలని..నాటి మాజి ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ హయాంలోనే ప్రతిపాదనలు ఉన్నాయని అక్కడి అన్నాడీఎంకే నేతలు డిమాండ్లు ప్రారంభించారు. అన్ని డిమాండ్లు అన్నా డీఎంకే వైపు నుంచే వస్తున్నాయి. మధురైను రెండో రాజధానిగా ప్రకటిస్తే.. ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి చెందుతుందని మంత్రి ఉదయకుమార్ సెంటిమెంట్ లేవనెత్తారు.
దివంగ నేత మాజి సీఎం జయలలిత మరణంతో అన్నాడీఎంకే నాయకత్వ కొరతతో అల్లాడుతోంది. పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఒకటికి రెండు సార్లు అతి కష్టమ్మీద విశ్వాస పరిక్షలో నెగ్గింది. దీనికి తోడు శశికళ సైతం సైతం ఎన్నికల నాటికి వస్తుందనే వార్తలు బలంగా వినపడుతున్నాయి. ఇప్పటి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి  టిటివి దినకరన్ చాలా ప్రయాత్నాలే చేశాడు. ఇలా వరుసగా వివాదాలతోనే ప్రస్తుతం అన్నాడింఎంకే ప్రభుత్వ నడుస్తోంది.
పలువురు సీనియర్ నేతలు రానున్న అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టారు. దీంతో అన్నాడీఎంకే ఎక్కడ తేలుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో ప్రాంతాల మధ్య రాజకీయం చేసుకుంటే.. గట్టెక్కవచ్చన్న ఆలోచన చేస్తున్నారనే ప్రచారం తమిళనాట జోరుగా సాగుతోంది.దాని ప్రభుత్వ లోపాలు,వివాదాలను దారి మళ్ళించవచ్చనే భావనలో పార్టీ నేతల వచ్చారని అంటున్నారు. రెండో రాజధాని ఏర్పాటు చేయాల్సి వస్తే.. అది తిరుచ్చినా..లేక మధురైనా అనే మరో వివాదం కానుంది. అది పక్కన పెడితే ఫస్ట్ మంట పుట్టిందాం అనే ప్లాన్ లో భాగంగానే మంత్రులు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. మధురై డీఎంకేకు మంచి బలమైన ప్రాంతం. ఓ వైపు మధురై.. మరో వైపు తిరుచ్చి నుంచి సెంటిమెంట్ రాజేస్తే.. ఎన్నికల నాటికి కొన్ని ప్రాంతాల్లో అడ్వాంటేజ్ సాధించవచ్చని భావిస్తున్నారనే వాదనా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: