అసూయతో రగిలిపోతున్న పాకిస్థాన్.. రామాలయ నిర్మాణం జరగకూడదనే దిశగా ఎత్తుగడలు.!

Kothuru Ram Kumar
5 శతాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ నిన్నటితో సాకారమైంది. 100 కోట్ల హిందువుల స్వప్నం ఫలించింది. భారతదేశం నలుమూలలా శ్రీరామ రూపం ప్రతిబింబించింది. రాముడి కోసం ఆయన జన్మస్థానంలోనే సుందరమైన, సుమధురమైన మందిరం ఘనంగా సిద్ధమైంది. అయోధ్యలో శ్రీరామచంద్రుడు జన్మించాడనే విషయం అందరికీ విదితమే. అక్కడ రామ మందిర నిర్మాణానికి నిన్న బుధవారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. సుముహూర్త సమయమైన మధ్యాహ్నం 12.44 గంటలకు 175 మంది అతిధుల మధ్య వైభవంగా శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి యోగి ఆదిత్యనాథ్, ఆనంది బెన్‌ పటేల్, మోహన్‌ భాగవత్, ట్రస్ట్‌ చీఫ్‌ సంత్‌ నృత్య గోపాల్‌ దాస్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
అయితే, ఈ వైభవాన్ని చూసి తట్టుకోలేకపోతున్న పాకిస్థాన్ ఎన్నో కుయుక్తులు పన్నుతుంది. ఎన్ని సార్లు అభాసుపాలైనా పాకిస్తాన్ మాత్రం తన పాకీ బుద్ధిని చూపించడం మానడం లేదు. భారత దేశానికి సంబంధించిన పర్సనల్ విషయాల్లో మరోసారి పాకిస్థాన్ జోక్యం చేసుకుంది. అయోధ్యలో రామాలయ నిర్మాణంపై వెర్రి కుట్రలు పన్నుతోంది. విషయంలోకి వెళితే...
1992లో అయోధ్యలోని ఆ సంబంధిత ప్రదేశంలో ఉన్న బాబ్రీ మసీదును హిందువులు కూల్చివేయడం, అనంతరం భారత దేశ వ్యాప్తంగా మత కల్లోలాలు చెలరేగడం అందరికీ తెలిసిందే. ఇకపోతే.. హిందూ, ముస్లిం వర్గాల మధ్య గత 5 శతాబ్దాలుగా సాగిన వివాదం అనంతరం, రామ జన్మ భూమి ప్రాంతం కేవలం రామ్‌లల్లాకే చెందుతుందని స్పష్టం చేస్తూ.. గత సంవత్సరం సుప్రీం కోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది.
ఇకపోతే, ఈ నిర్మాణానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ముమ్మాటికీ స్వార్ధపూరితమైందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇపుడు తన అక్కసుని వెళ్లగక్కుతోంది. ఇలాంటి చర్యలు వలన ఇటీవల భారత దేశంలో ముస్లింలు, వారి ప్రార్థనా మందిరాలపైన దాడులు పెచ్చుమీరుతున్నాయి అంటూ.. ఓ ప్రకటనలో పేర్కొంది. బాబ్రీ మసీదు ప్లేసులో రామాలయ నిర్మాణం ఎప్పటికీ మంచిది కాదని ఈ సందర్భంగా హెచ్చరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: