సముద్రంలో కి వెళ్ళకముందు .. కరోనా నెగటివ్.. వెళ్ళిన తరువాత పాజిటివ్

Kothuru Ram Kumar

కరోనా వైరస్‌కు సంబంధించిన ఓ మిస్టరీ నౌక కేసు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను కలవర పెడుతోంది. దీనిలో వాస్తవాలు తెలిస్తే ఇప్పటి వరకు వైరస్‌పై ఉన్న సమాచారం మొత్తం మారిపోవచ్చు. అసలు వైరస్‌ ఎన్నాళ్లు బతికి ఉంటుంది? ఇంక్యూబేషన్‌ సమయం ఎంత? క్వారంటైన్‌ ఎన్నాళ్లు చేయాలి? ఇవన్నీ మారినా ఆశ్చర్యపోనవసరంలేదు. అసలు వైద్యరంగానికి సవాళ్లు విసురుతున్న ఆ కేసు ఏమిటీ..

 

అర్జెంటీనాలో 'ఉషుయా' పేరుతో ఓ ప్రదేశం ఉంది. దీనిని 'ది ఎండ్‌ ఆఫ్‌ ది వరల్డ్‌' అని పిలుస్తారు. ఇక్కడ నుంచి ప్రజలు భారీ సంఖ్యలో చేపల వేటకు వెళుతుంటారు. జూన్‌ 6వ తేదీన ఇక్కడి 'ఏచిజన్‌ మారు పేరున్న ఓ నౌక చేపల వేటకు బయల్దేరింది. అన్ని సజావుగా సాగితే ఈ నౌక జులై 20న తిరిగి తీరానికి చేరాల్సి ఉంది. దీనిలో 61 మంది నావికులు ఉన్నారు. ఈ నౌక 35రోజులు సముద్రంలో గడిపాక జులై12నే హడావుడిగా తీరానికి వచ్చేసింది. దీనికో కారణం ఉంది. వీరు సముద్రంలోకి వెళ్లిన తర్వాత కొన్నాళ్లకు కొందరిలో జలుబు, జ్వరం రావడం మొదలైంది. మెల్లగా ఇది మిగిలిన వారికి కూడా పాకింది. చివరిలో నౌకలోని వైద్యసిబ్బంది కూడా వీటి బారిన పడ్డారు. దీంతో నౌకను తప్పనిసరై తీరానికి చేర్చారు. నౌకలోని 61 మందిలో 57 మంది నావికులు కరోనావైరస్‌ బారిన పడినట్లు తేలింది.

 

ఈ నౌక ప్రయాణం మొదలుపెట్టడానికి ముందు నావికులు మొత్తానికి కరోనా పరీక్షలు చేశారు. అందులో వారికి నెగిటీవ్‌ వచ్చింది. ఆ తర్వాత 14 రోజులు ఓ హోటల్‌లో నిర్బంధ క్వారంటైన్‌ చేయించారు. వీరు ఓడలోకి ఎక్కించిన సామగ్రిని క్షుణ్ణంగా పరీక్షించారు. ఆ తర్వాతే ప్రయాణం మొదలైంది.35 రోజుల ప్రయాణం మధ్యలో కొత్త వారు ఎవరూ నౌకలోనికి రాలేదు. నౌకలో వారు ఎవరూ బయటకు పోలేదు. బయట నుంచి కొత్తగా సామగ్రి కూడా ఏమీ రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: