సాగర తీరం విశాఖకు సునామీ ముప్పుందా...?

ప్రశాంతంగా ఉన్న గోదావరీ తీరంలో అలజడి వచ్చే అవకాశం ఉందా...? తుఫానులు వస్తే అల్లకల్లోలంగా మారే బంగాళాఖాతం ఇప్పుడు మరింతగా చెలరేగిపోయే అవకాశం ఉందా...? అంటే అవుననే అంటున్నారు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, (ఎన్‌ఐఓ), హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) శాస్త్రవేత్తలు. తూర్పుతీరానికి వంద కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో 300 కి.మీ. పొడవున ఫాల్ట్‌లైన్‌ ఉందని తాజాగా ఒక అధ్యయనంలో వెల్లడించారు. ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఆధ్వర్యంలో పని చేసే... ‘జర్నల్‌ ఆఫ్‌ ఎర్త్‌ సిస్టం సైన్స్‌’లో ప్రచురించారు. 

 

సాధారణంగా నదుల నుంచి సముద్రంలోకి భారీగా వరదలు, ప్రవాహాల సమయమ్లో నీటితో పాటుగా పెద్ద ఎత్తున మట్టి రాళ్ళు సహా ప్లాస్టిక్ వ్యర్ధాలు, జంతు వ్యర్ధాలు వంటివి వస్తు ఉంటాయి. దీనితో సముద్ర గర్భంలో ఇప్పుడు లక్షలాది టన్నుల భారం పడింది. ఇది క్రమంగా ఒత్తిడికి  కారణం అవుతుంది. ఇలా వివిధ నదుల నుంచి కొట్టుకొచ్చిన రాళ్లు, మట్టి వల్ల సముద్రంలో 22 కి.మీ. ఎత్తున మేటలు ఏర్పడ్డాయి అని గుర్తించారు. ఈ ఒత్తిడిని సముద్ర గర్భం భరించలేకపోతుంది. భూమి కంపించి కొంతభాగం చీలిపోయింది. 100 మీటర్ల నుంచి 900 మీటర్ల వరకు ఆ లోతు ఉందని వెల్లడించారు. 

 

గోదావరి ప్రాణహిత గ్రాబెన్‌ నుంచి నాగావళి వంశధార షియర్‌జోన్‌ వరకు సుమారు 300 కి.మీ వరకు ఈ భూమి కంపించిన సమయంలో చీలిక వచ్చింది అని వెల్లడించారు. రాళ్లు, మట్టి నమూనాల ఆధారంగా ఈ విషయాన్ని గుర్తించారు. 16 మిలియన్‌ సంవత్సరాల ఈ చీలిక వచ్చింది అని గుర్తించారు. 6.8 మిలియన్‌ సంవత్సరాల నుంచి 0.3 మిలియన్‌ ఏళ్ల కిందటి వరకు ఆ ప్రాంతంలో అలజడి ఉండవచ్చు అని వెల్లడించారు. 

 

ఈ సమయంలోనే పెద్ద ఎత్తున సునామీలు, భూకంపాలు కూడా వచ్చాయని పేర్కొన్నారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి భూకంపాలు, సునామీలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. తీరం వైపు భూభాగం అత్యధికంగా 900 మీటర్ల వరకు కుంగిన ఆధారాలను గుర్తించారు. విశాఖ తీరంలో ఈ కుంగుబాటు ఎక్కువగా ఉందని భవిష్యత్తులో సునామీ ముప్పు విశాఖ తీరానికే కాకుండా గోదావరి పరిసర ప్రాంతాల్లో కూడా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: