వారెవా వాట్‌ ఎ బంపర్ ఆఫర్‌: ఒక్క డాలర్‌ కే సొంత ఇల్లు..!?

Chakravarthi Kalyan

వ్యాపారం అభివృద్ధి చేసుకునేందుకు చాలా వ్యాపార సంస్థలు ఆఫర్లు ఇస్తుంటాయి. అందులో కొన్ని అసలు నమ్మశక్యంగా ఉండవు.. ఒక్క రూపాయికి కారు.. ఒక రూపాయికి బైక్.. ఇలాంటి ఆఫర్లు కనిపిస్తాయి. అయితే ఆ ఆఫర్లలో ఏదో ఒక మతలబు ఉంటుంది. అయితే విచిత్రంగా ఇటలీలో ప్రభుత్వమే ఓ బంపర్ ప్రకటించింది. 

 


ఆ బంపర్ ఆఫర్ ఏంటంటే... ఒక్క డాలర్‌ కే సొంత ఇల్లు.. ఇది మరీ విచిత్రంగా ఉంది కదా. కానీ.. అయితే.. ఇదేదో వ్యాపారం కోసం కాదు.. పట్టణాలకు వలసలు వెళ్లిపోయి.. ఖాళీ అయిన ఓ గ్రామాన్ని పునరుద్ధరించేందుకు ఇటలీలోని చింక్వా ఫ్రాండీలో ఈ బంపర్ ఆఫర్ ప్రకటించారు. దీని ప్రకారం.. ఎవరైనా కనీసం మూడేళ్లు ఉంటామని రాసిస్తే ఒక్క డాలరుకే ఇల్లు సొంతం చేసుకోవచ్చు. 

 


అయితే ఇందుకూ కొన్ని కండీషన్లు ఉన్నాయి. ఈ గ్రామంలోనే స్థిరపడాలని భావించేవారు కేవలం ఒక్క డాలరు చెల్లించి ఇంటిని సొంతం చేసుకోవచ్చు. కానీ.. పాడుబడిన ఇళ్లు కావడంతో మూడేళ్లలో ఇంటిని బాగు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పటివరకు ఏడాదికి 280 డాలర్లు ఇన్సూరెన్స్‌ పాలసీ కట్టాలి. అయితే ఇల్లు బాగు చేసుకున్నాక ఈ ఇన్సూరెన్స్‌ కట్టే పని ఉండదు. 

 


కానీ.. ఒకవేళ మూడేళ్లు దాటినా ఇల్లు బాగు చేసుకోకపోతే ప్రభుత్వం 22,470 డాలర్లు అంటే ఏకంగా రూ. 17 లక్షలు ఫైన్ వేస్తుంది. పాడుబడిన గ్రామానికి పునర్‌ వైభవం తీసుకువచ్చేందుకు చేపట్టిన ఈ కార్యక్రమానికి ‘ఆపరేషన్‌ బ్యూటీ’  అని పేరు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: