చిరుతను చంపి భుజాన వేసుకొని చక్కర్లు కొట్టారు.. వీడియో వైరల్..

siri Madhukar

ఈ మద్య మనుషులు మృగాల కన్నా కృరంగా మారుతున్నారు.  ఇటీవల కేరళాలో జరిగిన ఉదంతం గురించి తెలిసిందే.. నిండు గర్భంతో ఉన్న ఏనుగును అత్యంత పాశవికంగా చనిపోయేలా చేశారు.  పద్నాలుగు రోజలు పాటు నరకం అనుభవించి ఆ ఏనుగు చనిపోయింది. ఆదే తరహాలో మరో ఏనుగు కూడా మృతి చెందింది.  ఇక దేశంలో ఈ తరహా కృరమైన చర్యలను కొంత మంది వీడియోలుగా చిత్రీకరించడం.. టిక్ టాక్ లు చేయడం లాంటి చేస్తూ పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఇక లాక్ డౌన్ మొదలు  పెట్టినప్పటి నుంచి దేశంలో అటవీ ప్రాంతాల నుంచి కొన్ని కృర మృగాలు బయటకు వస్తున్నాయి.  కొన్ని చోట్ల మనుషులపై దాడులు చేస్తున్నాయి. ముఖ్యంగా చిరుత, ఎలుగు లాంటి జంతువులు గ్రామాల్లోకి రావడం ఆవులు, మేకలు, కోళ్లను చంపి తింటున్నాయి.

 

అయితే గ్రామాల్లో చిరుతలను చూసి జనాలు భయాందోళనకు గురి అవుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే పలు మార్లు చిరుతలు చేసిన రచ్చ గురించి తెలిసిందే. తాజాగా జనావాసాల్లోకి వచ్చిన ఓ చిరుతను స్థానికులు కొట్టి చంపారు. దాన్ని వెంబడించి ప్రాణాలు తీసి ఊరేగించారు. అస్సాంలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆరుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. గౌహతి శివారు ప్రాంతాల్లో ఓ చిరుత కనిపించింది.

 

దాన్ని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే కొంత మంది యువకులు దాన్ని వెంబడించారు. చేతికి అందిన రాళ్లు కర్రలు తీసుకొని కొట్టి చంపారు. ఇక చిరుత చనిపోయిందని కన్ఫామ్ చేసుకున్న తర్వాత తామేదో హీరోయిజం చేసినట్లు  భుజాలపై మోసుకుంటూ గ్రామంలో ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అటవీశాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. వీడియో ద్వారా ఆరుగురు వ్యక్తులను గుర్తించి కేసు నమోదు చేశారు. గ్రామస్తులు దాన్ని చంపడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. 

" height='150' width='250' src="https://www.youtube.com/embed/YAJakREUzs0" width="560" height="315" data-framedata-border="0" allowfullscreen="allowfullscreen">

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: