లాక్‌డౌన్ 4.0 అమలుకు సిద్ధం..?

siri Madhukar

దేశంలో కరోనా కేసులు ప్రతిరోజూ పెరిగిపోతూ వస్తున్నాయి.  మార్చి 24 నుంచి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తలిసిందే.  ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి.  ఈ రోజు తో ప్రధాని మోదీ చెప్పిన లాక్ డౌన్ ముగిసిపోయింది. అయితే రేపటి నుంచి మళ్లీ లాక్ డౌన్ 4.0 మొదలు అవుతుంది.  దేశంలో లాక్ డౌన్ 4.0 సోమవారం నుంచి ప్రారంభమవుతోంది. ఇది ఈ నెల 31 వరకు కొనసాగుతుంది. ఈ నాలుగో దశ లాక్ డౌన్ కొత్త నిబంధనలతో డిఫరెంట్ గా ఉంటుందని ప్రధాని మోదీ ఇదివరకే ప్రకటించారు. దేశవ్యాప్తంగా 30 జిల్లాల్లో కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఆయా జిల్లాల్లో లాక్‌డౌన్4 అమలుకు కేంద్రం కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

 

80 శాతం కేసులు ఆ జిల్లాల్లోనే ఉండగా, లాక్‌డౌన్ 4ను ఎలా అమలు చేయబోతున్నారనేది తేలాల్సి ఉంది. ఆ 30 జిల్లాల మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కేంద్రం చర్చించిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ 30 మున్సిపాలిటీల్లో కరోనా ఆంక్షలు అత్యంత కఠినంగా ఉంటాయని, మిగతా ప్రాంతాల్లో పెద్దగా ఆంక్షలు ఉండవట.  కంటైన్ మెంట్ జోన్లలో మినహా రెడ్, ఆరెంజ్, గ్రీన్‌ జోన్లలో ఆటోలు, రిక్షాలు, బస్సులు, క్యాబ్‌లు తిరిగేందుకు కేంద్రం అనుమతించే అవకాశాలున్నాయని సమాచారం. 

 

ఔరంగాబాద్, బృహన్ ముంబై, గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ చెన్నై, అహ్మదాబాద్, థానే, ఢిల్లీ, ఇండోర్, పుణె, కోల్‌కతా, ఆగ్రా, జైపూర్, నాసిక్, జోధ్‌పూర్, తిరువళ్లూర్, కడలూరు, సూరత్, చెంగల్పట్టు, హౌరా, అరియాలూర్, కుందూర్, మీరట్, భోపాల్, అమృత్‌సర్, మీరట్, విల్లుప్పురం, వడోదర, ఉదయ్‌పూర్, పాల్ఘర్, బెహ్రాంపూర్, సోలాపూర్ జిల్లాలు ఉన్నాయి. అక్కడ మే 31 వరకు కఠిన ఆంక్షలు అమలు కానున్నాయి.  కరోనా వ్యాప్తి నియంత్రణకు మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు చేపట్టిన చర్యలను అధికారులు సమీక్షించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: