రైలు చక్రాల కింద నలిగిన వలస కూలీలు... 17 మంది దుర్మరణం..?

praveen

ప్రస్తుతం కరోనా  వైరస్ ప్రభావం ఎంతో మంది వలస కూలీల జీవితాలను అయోమయంలో  పడేసిన విషయం తెలిసిందే. చాలా మంది వలస కూలీలు ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వెళుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్  అమలులో ఉండటంతో ఉపాధి కరువై వలస కూలీల బతుకు దుర్భరంగా మారిపోయింది. దీంతో ఇప్పుడిప్పుడే లాక్ డౌన్  సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్దామని ముల్లె మూట సర్దుకుని వలస కూలీల అందరూ బయలుదేరారు. ఈ క్రమంలోనే కొంత మంది వలస కూలీలు గురువారం నాటికి ఔరంగాబాద్ చేరుకున్నారు. అప్పటికి రాత్రి కావస్తోంది... ప్రయాణం చేసి బాగా అలసిపోయారు.. కాసేపు సేద తీరుదాం  అనుకున్నారు వలస కూలీలు. పక్కనే రైల్వే ట్రాక్ కనిపించింది. ప్రస్తుతం లాక్ డౌన్  కాబట్టి ఎలాంటి రైలు అటు నుండి  రావు అనుకొని ఏకంగా పట్టాలపై నిద్రించారు.

 

 

 

 ఉదయాన్నే లేచి వెళ్దామని అనుకున్నారు కానీ... వారి జీవితాల్లో రేపటి ఉదయం లేకుండా పోయింది. నిద్రలోనే కన్నుమూసారు ఆ వలస కూలీలు. ఆ రైల్వే ట్రాక్ ఆ కూలీల ప్రాణాల పాలిట మృత్యు శకటం గా మారిపోయింది. పట్టాలపై అతి వేగంగా దూసుకొచ్చిన రైలు వాళ్ళందరిని చిదిమేసింది... పట్టాలపై నలిపేసింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో చోటుచేసుకుంది. సొంతూరులో కు బయల్దేరిన 17 మంది వలస కూలీలు రైలు పట్టాల కింద నలిగి పోయారు. మహారాష్ట్రకు ఉపాధి నిమిత్తం వచ్చిన ఈ వలస కూలీలు ఛత్తీస్ ఘడ్ లోని  తమ స్వస్థలానికి పయనమయ్యారు. గురువారం రాత్రికి ఔరంగాబాద్ చేరుకున్నారు. 

 

 

 అప్పటికే రాత్రి అవ్వడం అలసిపోవడం తో కాసేపు సేద తీరుదామని పట్టాలపై  నిద్రించారు వలస కూలీలు. అయితే లాక్ డౌన్  కారణంగా ఏ రైలు అటువైపుగా రాదు అనుకున్నారు. కానీ గూడ్స్ రైలు రూపంలో మృత్యు వస్తుందని గ్రహించలేకపోయారు ఆ వలస కూలీలు. దీంతో అతి వేగంగా వచ్చిన గూడ్స్ రైలు వారిపై నుంచి దూసుకెళ్లడంతో ఆ చక్రాల కింద 17మంది దుర్మరణం చెందారు. నలుగురి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. వారు ప్రస్తుతం ఔరంగాబాద్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇదేకాదు ప్రస్తుతం లాక్ డౌన్  సడలింపు లో భాగంగా సొంతూళ్లకు బయల్దేరిన వలస కూలీలకు అడుగడుగునా ఎన్నో సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: