చంద్రబాబు ఇన్సిడెంట్ తర్వాత వైజాగ్ అంటే పవన్ ఇంత భయపడిపోయాడా ?

Vijaya
ఎక్కడో స్విచ్చేస్తే ఇంకెక్కడో బల్బు వెలిగినట్లుంది వ్యవహారం. చంద్రబాబునాయుడు మీద దాడి ప్రభావం జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద బాగా తీవ్ర ప్రభావాన్నే చూపినట్లుంది. సోమవారం నుండి మూడు రోజులు జరగబోతున్న ఉత్తరాంధ్ర పార్టీ సమావేశాలకు పవన్ హాజరు కావటం లేదు. తనకు బదులుగా మరో సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ను పంపుతున్నారు. పవన్ లేకుండా పార్టీ సమావేశాలు జరుగుతున్నది బహుశా ఇదే మొదటిసారేమో.

విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటిల్ గా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదనను చంద్రబాబునాయుడు ఎంతగా వ్యతిరేకిస్తున్నారో అందరికీ తెలిసిందే. ఒకవైపు విశాఖను రాజధానిగా వ్యతిరేకించి రాష్ట్రమంతా తిరుగుతున్నారు. అదే కారణంతో విశాఖకు వస్తే జనాలు ఊరుకుంటారా ?  అందుకనే విశాఖపట్నం విమానాశ్రయానికి వచ్చిన చంద్రబాబుకు ఏమి జరిగిందో అందరు చూసిందే.  సరే చంద్రబాబును పక్కన పెడితే పవన్ కుడా ఇదే విధంగా జగన్ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

జగన్ ను చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారంటే అర్ధముంది. మరి పవన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ? ఎందుకంటే చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారు కాబట్టే జగన్ ను జనసేనాని కూడా వ్యతిరేకిస్తున్నారంతే. రాజధానిగా వ్యతిరేకిస్తు మళ్ళీ వైజాగ్ వెళితే చంద్రబాబుకు ఏమైందో పవన్ కూడా గ్రహించారు. ఆ భయంతోనే  తాను విశాఖకు వెళ్ళకూడదని డిసైడ్ అయినట్లు అనిపిస్తోంది.  ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబును వదలని వైజాగ్ జనాలు పవన్ ను వదులుతారా ?

పైగా మొన్నటి ఎన్నికల్లో పవన్ విశాఖపట్నంలోని గాజువాక నుండి పోటి చేసి చిత్తుగా ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. తాను జిల్లా నుండి పోటి చేసినందుకైనా రాజధానిగా జగన్ ప్రతిపాదనను స్వాగతించుండాల్సింది. విశాఖను పవన్ స్వాగతించుంటే ఇపుడు జనసేనాని పరిస్ధితి ఇంకోరకంగా ఉండేదనటంలో సందేహం లేదు. జనాభిప్రాయానికి వ్యతిరేకంగా నడుచుకుంటే ఏమవుతుందో చంద్రబాబు విషయంలో రుజువైంది. అందుకనే తాను కూడా విశాఖపట్నం వెళ్ళకుండా మానుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: