జర్మనీలో కాల్పుల మోత.. 8 మంది మృతి..!

Edari Rama Krishna

ఈ మద్య ఎక్కడ చూసినా ఉగ్రవాదులు కలకలం సృష్టిస్తున్నారు. విచక్షణారహితంగా కాల్పులకు తెగబడుతు భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.  చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా అందరినీ నిర్థాక్షిణ్యంగా కాల్చివేయడం, బాంబు దాడులు చేయడం చేస్తున్నారు. జర్మనీలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు.  మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను దగ్గరలోని హిస్పిటల్ కి తీసుకు వెళ్లి చికిత్స చేయిస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం నిన్న రాత్రి 10 గంటలు దాటిన తర్వాత హనావ్ నగరంలో గుర్తు తెలియని సాయుధులు కాల్పులకు తెగబడ్డారు.

 

బుల్లెట్లు దూసుకెళ్లిన వాళ్లలో ముగ్గురు... అక్కడికక్కడే పడి స్పాట్‌లోనే చనిపోయారు. మిగతా వారిని ఆస్పత్రికి తరలించారు. కాల్పులు తర్వాత దుండగులు... అక్కడి నుంచీ కారులో పారిపోయారు. ఐతే... కొందరి గన్స్‌లో కొన్ని బుల్లెట్లు మిగిలాయి. వాటిని కారులో మోసుకెళ్లడం ఎందుకనుకున్నారో ఏమోగానీ... వేరే ప్రాంతంలోకి హుక్కా బార్‌కి వెళ్లి అక్కడ కూడా కాల్పులు జరిపారు.  మొదట కాల్పుల ఘటన నగరం మధ్యలో ఉన్న హుక్కా సెంటర్‌ వద్ద చోటుచేసుకున్నట్లు స్థానికి మీడియా తెలిపింది. అక్కడి నుంచి దుండగులు కారులో వేరే ప్రాంతానికి చేరుకొని మరోసారి కాల్పులకు తెగబడినట్లు పోలీసులు తెలిపారు. మొదటి ఘటనలో ముగ్గురు మృతిచెందిగా, రెండో ఘటనలో ఐదుగురు మృతి చెందారు. 

 

కాల్పుల మృతులు, గాయపడిన వారంతా కుర్దులని తెలుస్తోంది. ఫైరింగ్ ఎందుకు చేశారన్నది మాత్రం తెలియలేదు. పోలీసులు డోర్ టు డోర్ బెల్స్ కొట్టి మరీ దుండగుల కోసం వెతుకుతున్నారు. పై నుంచీ హెలికాప్టర్లు కూడా తిరుగుతున్నాయి. చిత్రమేంటంటే... కాల్పులు జరిపింది ఎంత మంది అన్నది కూడా పోలీసులకు అంచనా లేదు. కాల్పుల అనంతరం దుండగులు పరారయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. దీనిని ఉగ్రఘటనగా పోలీసులు అనుమానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: