పవన్ ఎంత తెలివైనవాడో అందరికీ తెలిసిపోయిందా ?

Vijaya
రాష్ట్రంలో ఏం జరుగుతోందో కూడా తెలుసుకునే విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుర్ర సరిగా పనిచేస్తున్నట్లు లేదు. ’ఎద్దు ఈనిందంటే దూడను కట్టేయమన్న’ సామెతలాగ తయారైంది పవన్ వ్యవహారం. చంద్రబాబునాయుడు లేకపోతే తెలుగుదేశంపార్టీ ఎద్దు ఈనిందని అనగానే  పవన్ వెంటనే  మద్దతుగా మాట్లాడేస్తుంటారు. కియా మోటార్ కార్ల తయారీ ప్లాంట్ విషయంలో మొదలైన గందరగోళమే తాజా ఉదాహరణ.

అనంతపురం జిల్లాలోని కియా కార్ల ఉత్పత్తి యూనిట్ తమిళనాడుకు తరలి వెళ్ళిపోతోందంటూ ప్రముఖ మీడియా సంస్ధ రాయిటర్స్ ఓ కథనాన్ని అచ్చేసింది. నిజానికి ఈ కథనమే జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లేందుకు ఉద్దేశించిందని చదవగానే అర్ధమైపోతుంది. ఎలాగైనా సరే జగన్ ను గబ్బు పట్టించటమే ధ్యేయంగా చంద్రబాబు, ఎల్లోమీడియా ఏకమై ప్రతి రోజు తప్పుడు కథనాలు, వార్తలు అచ్చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే.

చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చూపించి విషం చిమ్మటమే లక్ష్యంగా చంద్రబాబు, టిడిపి నేతలు, ఎల్లోమీడియా చాలా కో ఆర్డినేషన్ తో పనిచేస్తున్నారు. వీళ్ళతో పవన్ కూడా జత కలిశారు. కియా కార్ల ఉత్పత్తి సంస్ధ తమిళనాడుకు వెళ్ళిపోతుందనే ప్రచారం  విషయంలో  ఆందోళన చెందుతున్నట్లు పవన్  చెప్పటమే విచిత్రంగా ఉంది. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కొత్త పరిశ్రమలేవీ రాకపోతే ఉన్న పరిశ్రమలు కూడా వెళ్ళిపోతున్నాయని పవన్ చెప్పటమే విచిత్రంగా ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పవన్ ట్విట్టర్లో ప్రకటన పెట్టే సమయానికే ప్రచారం తప్పని తేలిపోయింది.

జగన్ వల్ల రాష్ట్రం నుండి వెళ్ళిపోయిన పరిశ్రమలేవని మాత్రం పవన్ చెప్పలేదు. విశాఖపట్నం నుండి ఐటి కంపెనీలు కూడా వెళ్ళిపోతున్నాయని ఆరోపిస్తున్న పవన్ వెళ్ళిపోయిన కంపెనీలేవో మాత్రం ఎందుకు చెప్పటం లేదు ? చంద్రబాబు భూమి ఇచ్చిన మూడున్నరేళ్ళ తర్వాత కూడా విశాఖపట్నంలో లూలూ గ్రూపు ఎందుకు పనిమొదలు పెట్టలేదో చంద్రబాబును పవన్ ఏనాడైనా అడిగారా ? వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేయటం వాటిని పవన్ క్యారీ చేయటమే పనిగా పెట్టుకున్నారు కానీ సొంత బుర్రను మాత్రం  వాడాలని అనుకోకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: