హమ్మయ్య ఉత్తమ్ పరువు ఈరోజు నిలబడింది.. రేపు ఉంటుందా...?

praveen

నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. నేరేడుచర్ల లో ముగ్గురు టీఆర్ఎస్ సభ్యులకు  ఎక్స్ అఫీషియ సభ్యులుగా  ఓటు హక్కు ఉండగా ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలకు ఓటు హక్కు ఉంది. ఈ నేపథ్యంలో ఎక్స్ అఫీషియ సభ్యుడిగా ఉన్న కెవిపి రామచంద్ర రావు ఓటు  తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసింది తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల కమిషనర్ సంప్రదించారు. దీంతో ఎక్స్ అఫీషియ సభ్యుడిగా రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావుకు ఓటు హక్కు కల్పిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు   నాగిరెడ్డి జారీ చేశారు. ఈ నేపథ్యంలో నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక మరింత ఉత్కంఠగా మారింది. 

 

 

 15 వార్డులున్న నేరేడుచర్ల లో  టిఆర్ఎస్7,  కాంగ్రెస్7,  సిపిఎం 1 స్థానాల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ సిపిఎం కూటమిగా ఉన్నది. అయితే నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 19 మంది  నుండి చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో పాల్గొంటారని రిటర్నింగ్ అధికారి జాబితాలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రామచంద్రరావు  ఓటు పెట్టుకున్నప్పటికీ ఓటు హక్కు కల్పించలేదు.కానీ  ఎన్నికల కమిషనర్ ఆదేశాలతో రాజ్యసభ సభ్యుడు కేవీపీ ఓటు వచ్చింది . ఇకపోతే ఏడు స్థానాల్లో గెలిచిన టిఆర్ఎస్ కు  3 ఎక్స్ అఫీషియ ఓట్లతో కలిపి పది ఓట్లు కాగా...  సిపిఎం మద్దతుతో కాంగ్రెస్ కు 8 ఓట్లు ఉండగా  ఇద్దరు ఎక్స్ అఫిషియో ఓట్లతో కలిపి పది స్థానాలకు చేరుకుంది. ఇరు పార్టీలకు సమాన బలం చేకూరింది. ఈ క్రమంలోనే చైర్మన్ ఎన్నిక  తీవ్ర ఉత్కంఠ గా మారింది. 

 

 

 

 ఇకపోతే మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో ఎంతో హైడ్రామా నడిచింది. ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా  రాజ్యసభ సభ్యుడు కెవిపిని  లోపలికి అనుమతించడంతో టిఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా మైక్ ను విరగొట్టి చేతిలో పేపర్లని  చింపేసారు . ఈ క్రమంలోనే ఉత్తంకుమార్ రెడ్డి ఎమ్మెల్యే మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కేవీపీకి  ఓటు హక్కు కల్పించిన పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే చైర్మన్ ఎన్నికలు రేపటికి వాయిదా పడాలని తెలిపారు . ఇక మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో తీవ్ర గందరగోళం  నెలకొనడంతో రేపటికి చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. అయితే ఉత్తమ్  పరువు ఈరోజు నిలబడినప్పటికీ రేపు ఉంటుందా లేదా అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ గెలిచిన చోట కూడా టిఆర్ఎస్ వైపు కౌన్సిలర్లు కార్పొరేటర్లు వెళ్ళిపోతు ఉన్నారు.  రేపటి ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఎలాగో కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గంలో మున్సిపాలిటీ పడిపోయింది మరి కాంగ్రెస్ గెలిచిన నేరేడుచర్ల అయినా ఉంటుందా లేదా అనేది రేపు తేలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: