కేవీపీకి దిమ్మ తిరిగే షాక్‌... కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ‌..!

Reddy P Rajasekhar

ఈరోజు మరికొన్ని గంటల్లో సూర్యాపేట లోని 5మున్సిపాలిటీలలో ఛైర్మన్ మరియు వైస్ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. టీఆర్‌ఎస్ పార్టీ ఛైర్మన్ అయ్యేందుకు సూర్యాపేట, తిరుమల గిరి, హుజూర్ నగర్, కోదాడ మున్సిపాలిటీలలో పూర్తి స్థాయి మెజారిటీ ఉన్న విషయం తెలిసిందే. కానీ నేరేడుచర్ల మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక మాత్రం ఉత్కంఠ రేపుతూ ఉండటం గమనార్హం. నిన్న రాత్రి నుండి ఎక్స్ అఫీషియో ఓటుపై ఇక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. 
 
సూర్యాపేట పరిధిలోని నేరేడుచర్ల మున్సిపాలిటో ఎక్స్ అఫీషియో సభ్యుడు కేవీపీ రామచంద్రరావుకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఎక్స్ అఫీషియో సభ్యుడుగా కేవీపీ రామచంద్రరావు తన ఓటును నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఉపయోగించుకోవాలని అనుకున్నారు. కానీ ఎన్నికల అధికారి మాత్రం కేవీపీ రామచంద్రరావు ఓటును తిరస్కరించారు. ఓటును తిరస్కరించడంతో షాక్ అవ్వడం కేవీపీ వంతయింది. 
 
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడు అయిన కేవీపీ ఓటును తిరస్కరించడంతో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆందోళనకు దిగారు. ఎన్నికల అధికారి కేవీపీ రామచంద్రరావు ఓటును ఎందుకు తిరస్కరించారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కేవీపీ రామచంద్రరావు ఓటును అంగీకరిస్తే గెలుస్తుందనే భావనతో కేవీపీ ఓటును తిరస్కరించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణలు చేశారు. 
 
ఈ మున్సిపాలిటీలో 15 వార్డులు ఉండగా కాంగ్రెస్ 7, సీపీఎం 1, టీఆర్‌ఎస్ 7 వార్డుల్లో విజయం సాధించింధి. కాంగ్రెస్ సీపీఎం కూటమి 8 వార్డుల్లో విజయం సాధించినా టీఆర్‌ఎస్ పార్టీ ఎక్స్ అఫీషియో అస్త్రాన్ని సంధిస్తోంది. టీఆర్‌ఎస్ పార్టీ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్సీ బి.వెంకటేశ్వర్లుకు, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ కు, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి ఓట్లున్నాయి. కేవీపీ ఓటును ఆమోదిస్తే డ్రా జరిగి ఉండేది. కానీ కేవీపీ ఓటును ఆమోదించకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాటలో ఉంది.            

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: