హుక్కా మత్తులో స్టూడెంట్స్.. !

NAGARJUNA NAKKA

హుక్కాపై పోలీసుల నిషేధాజ్ఞలు బేఖాతర్ చేస్తున్నారు. విద్యార్థులు, యువతే టార్గెట్‌గా గుట్టుగా వ్యాపారం చేస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడలో హుక్కా సెంటర్లపై దాడులు నిర్వహించిన పోలీసులు... 40 మంది యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. 

 

చాంద్రాయణగుట్ట పీఎస్ పరిధిలోని బండ్లగూడలోని నాహ్ధీ హుక్కా సెంటర్‌లో గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం సాగుతోంది. యువతను ఆకర్షిస్తూ మత్తులోకి దింపుతున్నారు. స్కూళ్లు, కాలేజీలకు డుమ్మా కొట్టి పుస్తకాల బ్యాగులతోనే హుక్కా సెంటర్‌కు చేరుతున్న స్టూడెంట్స్...గుప్పుమని హుక్కా పీల్చేస్తున్నారు. పట్టుబడిన వారిలో కొందరు మైనర్లు ఉన్నట్టు గుర్తించారు. 

 

హైదరాబాద్ నగరంలో హుక్కా విక్రయాలు సాగించరాదని ఉత్తర్వులున్నా నిర్వాహకులు ఖాతరు చేయడం లేదు. గతంలోనూ నాహ్థీ హుక్కా సెంటర్ పై హుక్కా విక్రయాలు జరుపుతున్నట్టు కేసులున్నాయి. విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు నాహ్థీ హుక్కా సెంటర్ పై దాడులు నిర్వహించి..40 మంది యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. 

 

హుక్కా పైపుల్లో ప్రమాదకరమైన ఫ్లవర్స్ మిక్స్ చేసి విక్రయిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 40 హుక్కా పాట్స్ తో పాటు..ఫ్లవర్స్ ను పోలీసులు సీజ్ చేశారు. మైనర్లకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తామంటున్నారు పోలీసులు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న హుక్కా సెంటర్ నిర్వాహకులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. 

 

హుక్కా ఎంత ప్రమాదమో.. తెలిసినా.. కొందరు దాని జోలికి వెళుతున్నారు. తాత్కాలిక సుఖానికి అలవాటుపడి జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. హుక్కా కోసం వాడే పైపుల్లో విష పదార్థాలు పేరుకుపోయి.. అవి పీల్చే వారి శరీరంలో చేరి అనారోగ్యానికి గురిచేస్తున్నాయి. దీనివల్ల క్యాన్సర్ తో పాటు లంగ్స్ కు సంబంధించిన వ్యాధులు వచ్చి ప్రాణాలు పోతున్నాయి. ఇది గమనించని చాలామంది హుక్కా జోలికి పోతున్నారు. పోలీసులు హుక్కా సెంటర్లపై దాడులు నిర్వహించినా కూడా.. గుట్టుచప్పుడు కాకుండా ఈ దందా కొనసాగుతోంది. తల్లిదండ్రులు తమ పిల్లల

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: