సూర్యగ్రహణం రోజున సూర్యుడిని చూస్తే ఏమౌతుంది ?

Balachander

16 సంవత్సరాలకు ఒకమారు వచ్చే సూర్యగ్రహణం రేపు రాబోతున్నది.  రాబోయేది కంకణాకర సూర్యగ్రహణం అంటారు.  ఈ సూర్యగ్రహణం రోజున సూర్యుడిని చూడకూడదని అంటున్నారు.  కారణం ఏంటి అనే విషయం అనేక మంది అనేక రకాలుగా చెప్తున్నారు.  ఎన్నిరకాలుగా చెప్పినా కానీ, సూర్యగ్రహణం రోజున సూర్యుడిని ఎందుకు చూడకూడదు అని మాత్రం చెప్పలేకపోతున్నారు.  ఇక ఇదిలా ఉంటె, డిసెంబర్ 26 వ తేదీన ఉదయం 8:09 గంటల నుంచి 11:11 గంటల వరకు సంపూర్ణ సూర్యగ్రహణం ఉండబోతున్నది.  


మూడు గంటలపాటు ఈ సూర్యగ్రహణం ఉండబోతున్నది.  సూర్యగ్రహణం రోజున చాలా దేవాలయాలను మూసేస్తారు.  వెంకటేశ్వర స్వామి దేవాలయం  మూసేస్తారు.  ఈరోజు అర్ధరాత్రి నుంచి రేపు మధ్యాహ్నం వరకు దేవాలయన్ని  మూసేస్తారు.  ఇకపోతే, శ్రీకాళహస్తి దేవాలయం మాత్రం ఆరోజున తెరిచే ఉంచుతారు. కొన్ని ప్రత్యేకమైన పూజలు కూడా చేయబోతున్నారు. ఇక సూర్యగ్రహణం  రోజున మూల నక్షత్రం వాళ్ళు సూర్యగ్రహణం చూడకూడదట.  అలానే ధనసురాశిలో గ్రహణం ఏర్పడుతున్నది కాబట్టి ఆ రాశి వ్యక్తులు కూడా సూర్యగ్రహణం చూడకూడదని అంటారు.  


సూర్యగ్రహణం రోజున ధనసురాశి, వారు మాత్రమే కాదు, వీరితో పాటుగా కన్యా, వృషభరాశి వ్యక్తులు కూడా సూర్యగ్రహణం చూడకూడదని అంటున్నారు.  ఈ రెండు రాశుల వ్యక్తులు సూర్యగ్రహణం చూడకూడదు అనడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి.  అవేమంటే ఆరోజున ఈ రాశి వ్యక్తులు సూర్యగ్రహాన్ని చూసి దోషం ఉంటుంది.  జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి.  అందుకే చూడొద్దని అంటున్నారు.  మిగతా వ్యక్తులు కూడా ఈ సూర్యగ్రహాన్ని డైరెక్ట్ గా చూడకూడదు.  


డైరెక్ట్ గా కాకుండా సూర్యుడిని ఫిలిం ద్వారా, లేదంటే బైనాక్యులర్ ద్వారా చూడొచ్చని అంటున్నారు.  ఇలా చూడటం వలన సూర్యగ్రహణం వలన నష్టాలూ రావని అంటున్నారు.  ఇది 16 ఏళ్లకు ఒకేసారి వస్తుందని, ఇలాంటి గ్రహణాలు వచ్చినపుడు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.  ఈ గ్రహణం ఇండియాలో కనిపిస్తుంది.  మిగతా దేశాల్లో పెద్దగా కనిపించదు.  శ్రీలంక, కొన్ని గల్ఫ్ దేశాలు, సుమత్రా, మలేషియా, సింగపూర్‌లోనూ గ్రహణం ఎఫెక్ట్ కనిపించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: