హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2010-2020: బాబోరి పాల‌న‌లో నంది అవార్డులు టీడీపీ అవార్డుల‌య్యాయ్‌..!

venugopal

సినీ రంగంలో అత్యుత్త‌మ‌ ప్రతిభ కనబరిచిన వారికి నంది అవార్డులను ఇవ్వ‌డం ఆన‌వాయితీ. ఇకపోతే నంది పురస్కారాలు అనేవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినిమాలకు ఏటా ఇచ్చే పురస్కారాలు. తెలుగు చరిత్ర మరియు కళలకు ప్రతీకలలో ఒకటైన లేపాక్షి నంది పేరిట ఉత్తమ చిత్రాలకు, మరియు ఉత్తమ కళాకారులకు ఈ పురస్కారాలు ఇస్తారు. ఈ సంప్రదాయం 1964 సంవత్సరములో ప్రారంభమైనది.

 

 

ఆ రోజులలో చిత్ర నిర్మాణము చాలా తక్కువగా ఉండేది, ఏడాదికి సుమారు 25 నుండి 30 వరకు చిత్రాలు మాత్రమే తయారవుతుండేవి. రాను రాను వాటి సంఖ్య 125 నుండి 130 వరకూ పెరిగింది. చిత్ర నిర్మాణం సరళి, నాణ్యత, ప్రమాణాలు తగ్గుతూ భారీ వ్యయ ప్రయాసలకు లోనవుతుంది. మొదటిలో బంగారు, రజిత, కాంస్య నంది అనే 3 బహుమతులూ కథకు 2 బహుమతులూ, మొత్తము 5 పురస్కారాలుండేవి. చిత్ర నిర్మాణములో అన్ని శాఖలకు గుర్తింపు, ప్రోత్సాహము అందించే విధంగా ఇప్పుడు 42 నందులకు పెరిగినాయి.

 

 

ఇకపోతే టీడిపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాబోరి పాల‌న‌లో నంది అవార్డులు అన్ని టీడీపీ అవార్డుల‌య్యాయ్‌.. ఎందుకంటే టీడీపీ పార్టిలోని నాయకులు సినిమా నటులకంటే చాలా బాగా రాజకీయాల్లో నటిస్తుంటారు. ప్రజలముందు ఒకతీరుగా, వెనక ఒకతీరుగా ఉంటారు. ఇదే కాకుండా ఎలక్షన్ల సమయంలో ఓట్లకోసం చేసే గారడీలు మామూలుగా ఉండవు. ఇక చంద్రబాబు గారి పాలనలో నాయకుల నటనకు నంది అవార్డులు తప్పని సరిగా ఇవ్వవలసిందని కొందరు అభిప్రాయ పడుతున్నారు.

 

 

నటులు ప్రేక్షకుల్ని అలరించడానికి నటిస్తే. నాయకులు ప్రజలను ముంచడానికి నటిస్తారు. నటులకంటే చాలా బాగా నాయకులు నటిస్తారు. నటనలో జీవిస్తారు. పదవిలొకి రావడానికి దొంగప్రేమలు  ఒలకబోస్తే, పదవి వచ్చాక దోపిడి రాజ్యాన్ని ప్రజల కళ్లకు చూపిస్తారు. ఇకపోతే టీడీపీ హయామం లో చాల మంది నాయకులు తమ నటనా కౌశల్యాన్ని ప్రదర్శించి దండిగా డబ్బులు దండుకున్నారట. అని ఇప్పుడు రాజకీయాల్లో సాగుతున్న చర్చ జగన్ ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కటిగా వారి అవినీతిని వెలుగులోకి తెస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: