రాజకీయాల్లో సైద్దాంతిక పాతివ్రత్యానికి ఇక స్థానం లేదు!

రాజకీయ మంటే అధికారం కోసం ఎవరితోనైనా ఏవిధంగానైనా కలవటమే. బిజేపీని వదిలేసే ముందు సకల జనావళికి "శివసేన" ఇచ్చిన సంకేతమే కాదు, సందేశమూ ఇదే. ఎలాంటి భావ సారూప్యతా లేని శివసేనతో కలవటానికి కాంగ్రెస్, ఎన్‌సీపీ లు అంగీకైంచిన నాడే మహా జనావళికి అర్ధమైనది. 

 

ఈ కాలంలో శరవేగంతో మారుతున్న అరాచక రాజకీయ సూత్రాన్నే నాడు తన బాబాయి శరద్ పవార్ అనుసరించిన సిద్ధాంతాన్నే నేడు అబ్బాయి ఎన్‌సీపీ నేత అజిత్‌ పవార్‌ అనుసరించారు. ఎవరూ వేలెత్తి చూపలేనిది ముఖ్యంగా ఎన్సీపి అధినేత శరద్ పవార్. తన వెంట వచ్చిన శాసన సభ్యులతో బీజేపీ నాయక్త్వాన్ని కలిశాడు. ప్రతిఫలంగా ఉప ముఖ్యమంత్రి పదవి సొంతం చేసుకున్నాడు.

 

కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యం, కాకరకాయ లేకపోతే నైతికత పాతివ్రత్యం అనే సందేహాలు లేవనెత్తే అర్హతగాని సభ్యతగాని ఏ పార్టీకీ లేదనే అనుకోవాలి. బహుశా!   శివసేనతో జట్టుకట్టే విషయంపై కాంగ్రెస్‌ తనకు తానుగా తేల్చనంతవరకూ బీజేపీ కూడా మౌనంగానే ఉంది. శుక్రవారం రాత్రి శివసేనతో స్నేహానికి చేయి అందించగానే  కాంగ్రెస్‌ సైద్ధాంతిక పాతివ్రత్యం వది లేసింది - అధికారం చేతికి అందుతుందనగానే తనలోని వ్యాఘ్రం నిద్ర లేచింది. అందుకే వేగంగా పావులు కదిపింది.

 

ఇకతను పాతివ్రత్యం పచ్చిమిరపకాయ అనుకుంటే అధికారం కూడా పాతివ్రత్యం వదిలేస్తుందని అనుకోగానే కోడి కూసే వేళ లోనే 'రాష్ట్రపతి పాలన' కు జెండా ఏత్తేసి ముఖ్యమంత్రిగా దేవెంద్ర ఫడ్నవిస్‌ చేత ప్రమాణస్వీకారం చేయించింది. అందులో గవర్నరు పాత్ర కూరలో కరివేపాకే! తగినంత మద్దతుంది కాబట్టే అవకాశమిచ్చాను అనేది ఆయన మాట ఖచ్చితంగా అవుతుంది. అందుకే ఆ సందేహం ఎవరూ లేవ నెత్తరు. నిజానికి అర్హతలతో పనిలేకుండా తమకు నచ్చిన వారిని గవర్నర్లుగా నియమించే సంప్రదాయాన్ని జవహర్లాల్ నెహౄ కాలన్లోనే కాంగ్రెస్ తదాదిగా అన్నీ కేంద్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న సాంప్రదాయమే ఇది. కాబట్టి వారిది వికృత ప్రవర్తన అని, అది కేంద్రానికి అనుకూలంగా ఉండదని ఆశించటమే తప్పవుతుంది. 

 

అసలు మొత్తం భారత రాజకీయాల్లో శరద్ పవార్ అంత నమ్మ తగని రాజకీయ నాయకులు అరుదుగా కనిపిస్తారు. అదే పని నేడు ఆయన అన్న కొడుకు అజిత్ పవార్ పునఃరాచరించారు.

 

"తాతకు పెట్టిన బొచ్చె తలాపునే ఉంటుంది" కదా! అదే జరిగి ఉండవచ్చు. అయినా శివసేన - కాంగ్రెస్, ఎన్సీపితో కలయిక అంటే ఏ సైద్ధాంతిక విలువలులేని అనైతిక కలయికే! శివసేన బిజేపి రెండూ హిందూత్వ పార్టీలే. వారి కలయిక నైతికమే.

 

కాకపోతే శివసేన అత్యాశవల్లే ఈ పరిస్థితి వచ్చింది. లేకపోతే లౌకికత్వమే తమ సిద్ధాంతం అని చెప్పుకునే కాంగ్రెస్, అదే తానులోని ముక్కైన ఎన్సీపిలు - హిందూత్వ శివసేన పార్టీతో స్నేహం వ్యభిచారం కాక మరేమౌతుంది.

 

ఈ సంఘటన ఎలాంటి పాలన ఇస్తుందో ఊహకు అందదా!   మహాప్రజల నిశ్చయం, ఎంపిక బిజేపి-శివసేన సంకీర్ణమే! మరేదైనా జరిగితే ప్రజాభిప్రాయానికి మంగళం పాడినట్లే! దానికి బాధ్యులెవరైనా పతనం చవిచూడరా

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: