రాజ‌కీయం అంటే ఇదే... బాల‌య్య‌కు చుక్క‌లు చూపిస్తున్నారుగా....

VUYYURU SUBHASH
సినీ న‌టుడు, అనంత‌పురం జిల్లా హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు సొంతం చేసు కుంటున్న నంద‌మూరి బాల‌కృష్ణ‌కు తొలిసారి భారీ షాక్ త‌గిలింది. ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం, ఇక్క‌డ ప్ర‌జ‌లను ప‌ట్టించుకోక‌పోవ‌డం అనే విష‌యంలో బాల‌య్య‌కు సాటి మ‌రొక‌రు లేరు. గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో ఉన్న స‌మ‌యంలోనూ ఆయన ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన త‌ర్వాత ఐదేళ్ల‌లో మూడు... నాలుగు సినిమాలు తీసుకున్నారు. త‌ప్పితే.. ఇక్క‌డి ప్ర‌జ‌ల సంక్షేమాన్ని కానీ, వారి బాగోగులు కానీ ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. త‌న పీఏల‌ను ఇక్క‌డ ఏర్పాటు చేసినా, వారు అవినీతి బాగోతాల‌కు తెర‌దీసి ప్ర‌జ‌ల‌కు దూర‌మ‌య్యారు.


అయినా కూడా మ‌రోసారి గెలిస్తే.. నేను నియోజ‌క‌వ‌ర్గంలోనే అందుబాటులోనే ఉంటానంటూ.. త‌న స‌తీ మ‌ణిని వెంటేసుకుని మ‌రీ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేశారు బాల‌య్య‌. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న ఆధార్ అడ్ర స్‌ను, ఎన్నిక‌ల కార్డు అడ్ర‌స్‌ల‌ను కూడా హిందూపురానికి మార్పి డి చేసుకుని ప్ర‌జ‌ల‌కు చూపించారు. దీం తో ప్ర‌జ‌లు ఆయ‌న‌ను విశ్వ‌సించి మ‌రోసారి గెలిపించారు. అయితే,ఆ య‌న మ‌ళ్లీ ప్ర‌జ‌ల‌కు క‌నిపిం చ‌డం మానే శారు., దీంతో ఎక్క‌డి అభివృద్ధి అక్క‌డే అన్న‌ట్టుగా ప‌రిస్థితి మారిపోయింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన స్థానికులు ఎప్పుడు అవ‌కాశం దొరుకుతుందా ఎండ‌గ‌డ‌దాం.. అని ఎదురు చూశారు. ఈ క్ర‌మంలోనే వారికి తాజాగా అందిన అవ‌కాశంతో బాల‌య్య‌కు చుక్క‌లు చూపించారు.


ఎమ్మెల్యే బాలకృష్ణను లేపాక్షి మండలంలోని గలిబిపల్లి గ్రామస్థులు అడ్డుకున్నారు. లేపాక్షి – హిందూపురం రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. టీడీపీ అధికార ప్రతినిధి రమేశ్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు బాలయ్య హిందూపూరంకు వచ్చారు. హైదరాబాదు నుంచి బెంగళూరుకు చేరుకున్న బాలయ్య అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హిందూపురం వచ్చారు. బాలయ్య వస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు కొడికొండ చెక్ పోస్టు నుంచి హిందూపురం వచ్చే దారిలో గలిబిపల్లి క్రాస్ వద్ద ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు.


లేపాక్షి-హిందూపురం మెయిన్‌రోడ్డు నుంచి గలిబిపల్లికి రోడ్డు వేసేందుకోసం భూమిపూజ చేసి సంవత్సరం కావస్తున్నా పనులు ఇంకా పూర్తికాకపోవడంపై ఎమ్మెల్యే వద్ద గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ఒకింత తీవ్రంగానే గ్రామ‌స్థులు స్పందించ‌డంతో బాల‌య్య మౌనం పాటించారు. సాధార‌ణంగా త‌న‌ను ప్ర‌శ్నిస్తే.. స‌హించ‌లేని బాల‌య్య ఇప్పుడు మాత్రం ఓపిక‌గా వారి ఆవేద‌న‌ను ఆల‌కించి.. సంబంధిత అధికారుల‌తో మాట్లాడి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేలా చూస్తాన‌ని హామీ ఇచ్చాకే అక్క‌డి నుంచి క‌దిలారు. మ‌రి ఇప్ప‌టికైనా బాల‌య్య త‌న ప‌ద్ధ‌తిని మార్చుకుని క‌నీసం నెల‌లో రెండు సార్ల‌యినా ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటారో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: